న‌మ్ర‌త బ్యూటీ సీక్రెట్ లీక్‌.. రోజు మ‌హేష్ తో అది చేయాల్సిందే అట‌!

నమ్రత శిరోద్కర్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 1993 లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న న‌మ్ర‌త‌.. ఆ త‌ర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ క్ర‌మంలోనే వంశీ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన న‌మ్ర‌త‌.. తెలుగులో త‌న తొలి సినిమా హీరో అయిన మ‌హేష్ బాబును ప్రేమించి అత‌డితో ఏడ‌డుగులు వేసింది.

పెళ్లి త‌ర్వాత వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నా స‌రే న‌ట‌న‌కు పులిస్టాప్ పెట్టిన న‌మ్ర‌త‌.. సంపూర్ణ గృహిణిగా మారి ఇద్ద‌రు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. అలాగే హీరోయిన్లు ఒక్క‌సారి సినిమాలు చేయ‌డం మానేస్తే గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోతుంటారు. కానీ, న‌మ్ర‌త మాత్రం సినిమాలు మానేసి చాలా కాల‌మే అయినా.. ఇంకా అంతే అందంగా మ‌రియు ఫిట్ గా క‌నిపిస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటుంది.

నమ్ర‌త వ‌య‌సు 51. కానీ, పాతికేళ్ల ప‌డుచు పిల్ల‌లా క‌నిపిస్తూ అంద‌రి చూపులు త‌న‌పై ప‌డేలా చేస్తోంది. నిజానికి వయసు పెరిగే కొద్దీ శరీరం పటుత్వం కోల్పోతుంది. అలా జరగకుండా ఉండాలంటే కఠిన వ్యాయామం తప్పనిసరి. ఆహార నియమాలు కూడా పాటించాలి. న‌మ్ర‌త కూడా ఫిట్నెస్ అండ్ బ్యూటీని కాపాడుకునేందుకు మంచి డైట్ ను ఫాలో అవుతుంద‌ట‌. అలాగే రోజు ఉద‌యం మ‌హేష్ బాబుతో క‌లిసి ట్రైన‌ర్ స‌మ‌క్షంలో వ్యాయామాలు చేస్తుంద‌ట‌. తాజాగా కూడా జిమ్‌లో వ‌ర్కౌట్స్ చేస్తున్న ఓ వీడియోను నమ్ర‌త పోస్ట్ చేసింది. జిమ్ ట్రైనర్ కుమార్ మన్నవ పర్యవేక్షణలో కొత్త వ్యాయామాలు చేస్తున్న‌ట్లు న‌మ్ర‌త పేర్కొంది. ప్ర‌స్తుతం న‌మ్ర‌త తాజా వ‌ర్కౌట్ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

https://www.instagram.com/reel/CsIRdzjgKVr/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

Share post:

Latest