స‌మంత‌కు తెలీకుండా అలాంటి ప‌ని చేసి షాకిచ్చిన విజ‌య్‌.. వైర‌ల్ గా మారిన వీడియో!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సౌత్ స్టార్ సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం `ఖుషి`. శివ నిర్వాణ‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇందులో జ‌య‌రామ్‌, సచిన్ ఖేడేకర్, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమ కథగా రూపొందుతోన్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కానుంద‌ని ఇప్ప‌టికే మేక‌ర్స్ ఆఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. దాదాపు ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. విజ‌య్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ రీసెంట్ గా ఫ‌స్ట్ సింగిల్ ను విడుద‌ల చేశారు. `నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే` అంటూ సాగే ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ముఖ్యంగా యూత్ ను ఆక‌ట్టుకుంటూ ప్ర‌స్తుతం ఈ సాంగ్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే తాజాగా ఈ సాంగ్ తో స‌మంతతో క‌లిసి రీల్ చేశాడు. అది కూడా ఆమెకు తెలీకుండా ఆమెతోనే రీల్ చేసి షాకిచ్చాడు. `నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే` అంటూ లిరిక్స్ తగ్గట్టు విజయ్ .. సమంతతో రీల్ ను చిత్రీకరించి ఇన్‌స్టా ద్వారా పంచుకున్నాడు. ఎంతో రొమాంటిక్ గా ఉన్న ఈ రిలీ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. కాగా, ఈ సినిమాతో విజ‌య్ మంచి కంబ్యాక్ ఇవ్వాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. స‌మంత కూడా ఖుషితో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాల‌ని ఉత్సాహ ప‌డుతోంది.

https://www.instagram.com/reel/CsIho77Ias5/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

Share post:

Latest