రీ రిలీజ్‌లోనూ స‌రికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న ఎన్టీఆర్.. ఇది క‌దా అస‌లు సిస‌లు దెబ్బంటే…!

ఇటీవ‌ల‌ స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు. ఇదో ట్రెండ్‌గా మారింది. ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇలా ఈ అగ్ర హీరోల అందరూ త‌మ‌ సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసి భారీ కలెక్షన్లను అందుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఈ లిస్టులో చేరబోతున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సింహాద్రి సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు.

Watch Simhadri Movie Online for Free Anytime | Simhadri 2003 - MX Player

ఇప్పుడు తాజాగా ఈ సినిమా రీ రిలీజ్‌పై ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ రీ రిలీజ్ ట్రెండ్ లో సరికొత్త పంథా ఫాలో అవబోతున్నారు. కొత్తగా విడుదల చేయబోయే సినిమాలకు ప్రి రిలీజ్ ఈవెంట్ చేసినట్లుగా రీ రిలీజ్ సినిమాకి కూడా ఓ భారీ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారట. ఇప్పుడు ఈ ఘనత కూడా ఎన్టీఆర్ సింహాద్రికి దక్క‌టం మరో విశేషం.

Jr NTR Simhadri Re Release

త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా మారిన ఎన్టీఆర్..తన కెరీర్ లోనే ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాల్లో సింహాద్రి కూడా ఒకటి. తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. ఈ సినిమా విడుదల కన్నా ముందే మే 17న ఓ భారీ ప్రి రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారట. ఈవెంట్ హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఎంతో గ్రాండ్‌గా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Jr NTR's fans plans a special screening of Simhadri at the largest IMAX  screen

ప్రస్తుతం ఎన్టీఆర్- కొరాటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మూవీ టైటిల్ గ్లింప్స్ కూడా మే 20వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. వ‌చ్చే స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది.

Share post:

Latest