తాత‌ శతజయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్‌కు ఆహ్వానం… తార‌క్ ఈ ట్విస్ట్ ఏంటో…!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ నెల 20న కూక‌ట్‌ప‌ల్లిలో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఇతర నందమూరి కుటుంబ సభ్యులను టీడీపీ సీనియర్ నాయకులు టీడీ జనార్థ‌న్ ఆహ్వానించారు. అలాగే మే 20న జరిగే ఈ కార్యక్రమంలో జయహో ఎన్టీఆర్ వెబ్ సైట్ కూడా ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ పై ప్రత్యేకంగా రూపొందించిన శకపురుషుడు, సావనీర్‌ను విడుదల చేయనున్నారు.

article_image1

ఈ కార్యక్రమంలో ఈ నందమూరి కుటుంబ సభ్యులందరూ పాల్గొనాలని… అలాగే కార్యక్రమాన్ని నందమూరి బాలకృష్ణ – రామకృష్ణ పర్యవేక్షించనున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ లిటరేచర్, సావనిర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ చైర్మన్‌గా టీడీ జనార్దన్, ఇతర సభ్యులు.. సభ కార్యక్రమాలపై సినీపరిశ్రమ ప్రముఖులతో కూడా సమాలోచనలు నిర్వహించారు. మరోవైపు చంద్రబాబు కూడా ఈ కమిటీ సభ్యులతో ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా చర్చిస్తూ వారికి సలహాలుస్తూనే ఉన్నాడు.

article_image6

ఈ కమిటీ కన్వీనర్ టీజీ జనార్దన్ నందమూరి కుటుంబ సభ్యులు అందర్నీ కలిసి ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానాలు అందించారు. ఇదే సమయంలో ఈ కార్యక్రమానికి రావాలని జూనియర్ ఎన్టీఆర్ తో పాటు దగ్గుబాటి పురందేశ్వరి, నందమూరి కళ్యాణ్ చక్రవర్తిలను కలిసి ఈ ఆహ్వానాలను అందించారు. నందమూరి కుటుంబ సభ్యులకు ఆహ్వానం పలుకుతున్న టీజీ జనార్ధన్ వెంట నందమూరి రామకృష్ణ కూడా వెళ్లారు.

article_image5

ఇదే సమయంలో గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్‌ను, టిడిపి నందమూరి కుటుంబం దూరం పెడుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం ఎన్నోసార్లు చర్చ నియాంశంగా మారింది. ఇదే సమయంలో హైదరాబాద్ లో జరిగే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించడం ఇప్పుడు ఇటు టిడిపి వర్గాల్లోనూ, నందమూరి అభిమానులను కొత్త చర్చలకు దారి తీసింది. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారా లేదా అనేది చూడాలి.