మరొకసారి బోల్డ్ క్యారెక్టర్ లో అనసూయ..అంతకుమించి అనేలా..?

తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. హాట్ యాంకర్ గా పేరు పొందిన ఈమె ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు రకాల పోస్టులను షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తూ ఉంటుంది. పలు రకాల గ్లామర్ ఫోటోలతో పాటు తన పైన ట్రోల్ చేసే వారికి గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది అనసూయ. నిన్నటి రోజున అనసూయ పుట్టినరోజు సందర్భంగా తను నటించబోతున్న ఒక సినిమాలోని సుమతి అనే ఒక ఎమోషనల్ అండ్ బోల్డ్ క్యారెక్టర్లు నటించబోతున్నట్లు తెలియజేసింది.

Anasuya Bharadwaj to impress in bold character as Sumathi in 'Vimanam' -  Telangana Today
సముద్ర ఖని నటిస్తున్న విమానం సినిమాలో ఈమె కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా జూన్ 9వ తేదీన తెలుగు తమిళ్ భాషలలో విడుదల కాబోతోంది. డైరెక్టర్ శివప్రసాద్ మానాల దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. నిన్నటి రోజున అనసూయ బర్తడే సందర్భంగా విమానం సినిమా నుంచి మేకర్ సుమతి అనే పాత్రకు సంబంధించి ఒక చిన్న గ్లింప్స్ ను కూడా విడుదల చేశారు. ఇందులో అనసూయ చాలా అందంగా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది అసలు ఆమె అలా రెడీ కావడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే అంటూ మేకర్స్ తెలిపారు.

విమానం సినిమలో వీరయ్య అనే ఒక అంగవైకల్యం ఉన్న తండ్రి పాత్రలో సముద్ర కని నటించగా కొడుకు పాత్రలు మాస్టర్ దృవనే నటిస్తూ ఉన్నారు. సుమతి పాత్రలో అనసూయ నటించిన పాత్రలో ధనరాజ్ కోటి పాత్రలు రాహుల్ రామకృష్ణ తదితరునటీనటుల సైతం నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అనసూయకు సంబంధించి ఈ గ్లింప్స్ వైరల్ గా మారుతోంది. ఈసారి తన గత సినిమాలలో ఉండే పాత్రల కంటే మించి పోయేలా కనిపిస్తోంది.

Share post:

Latest