అచ్చం సమంత లాగే ఉన్న మరొక హీరోయిన్..!!

మన పూర్వీకుల నుంచి వస్తున్న మాట మనిషిని పోలిన మనుషులు ఉంటారని చెబుతూ ఉంటారు.కొన్నిసార్లు చూస్తే అలాగే అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోలు హీరోయిన్లు పోలిన నటీనటులు తరచుగా కనిపిస్తూ ఉంటారు.. ఇలాంటి వారిని డోపల్ గ్యాంగర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇలా ఇప్పటికే ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్, దీపికా పదుకొనే ,దిశాపటాని, ప్రియాంక చోప్రా తదితరులు స్టార్ హీరోయిన్ల డోపల్ గ్యాంగర్ లను వెతికి మరి పట్టుకుంటున్నారు నేటిజన్స్.

This Young Actress Look Exactly Like Samantha, Check Out!
టాలీవుడ్ విషయానికి వస్తే కోలీవుడ్ హీరోయిన్ ఆత్మిక చూడడానికి అచ్చం సమంత లాగే కనిపిస్తోంది.అలాగే బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి కూడా కొంచెం అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ జాబితాలో మరొక యువ నటి చేరిపోయింది. తాజాగా ఈమె ఫోటోలను చూసిన పలువురు నెటిజన్ల సైతం అచ్చం సమంత లాగే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రియదర్శి మెయిల్ సినిమా ద్వారా గుర్తింపు సంపాదించుకున్న గౌరీ ప్రియ రెడ్డి..

Modern Love Chennai Shoba | மாடர்ன் லவ் சென்னை

లవ్ స్టోరీ, శ్రీకారం వంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించింది గౌరీ ప్రియ. ఇటీవలె సుహాన్ రైటర్ పద్మభూషణ్ సినిమాలో కూడా నటించింది.. ప్రస్తుతం తెలుగులో పాటు తమిళంలో కూడా పలు సినిమాలలో నటిస్తోంది. గౌరీ ప్రియకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి .ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్ల సైతం అచ్చం సమంత లాగే ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్లో రాజీలాగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest