ఒకే ఒక్కడు సినిమాని కోల్పోయిన టాలీవుడ్ స్టార్ హీరో అతడే..

స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ ప్రియులకు ఎన్నో మంచి హిట్ సినిమాలను అందించారు శంకర్. తాజాగా రామ్ చరణ్‌తో శంకర్ ఒక క్రేజీ ప్రాజెక్టును చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్టార్ డైరెక్టర్ కు మంచి మంచి పేరు తెచ్చిన సినిమాల్లో ఒకే ఒక్కడు సినిమా కూడా ఒకటి. 1999వ సంవత్సరంలో విడుదలైన ఒకే ఒక్కడు సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో ఒక రికార్డు క్రియేట్ చేసింది.

అర్జున్ ఈ సినిమాలో కథానాయకుడుగా నటించగా అర్జున్‌కు సరసన మనిషా కొయిరాలా హీరోయిన్గా నటించింది. ఒక్కరోజు ముఖ్యమంత్రి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి సినీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తమిళ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఒకే ఒక్కడు సినిమా మొత్తం పాన్ ఇండియా లెవెల్‌లో రూ.30 కోట్ల షేర్‌ను రాబట్టగలిగింది. 1999లో రూ.30 కోట్లు కంటే తక్కువ ఏం కాదు, ఈ వచ్చిన రూ.30 కోట్లలో రూ.15 కోట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చినవే.

తాజాగా ఈ ఒకే ఒక్కడు సినిమా గురించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఒకే ఒక్కడు సినిమాకి డైరెక్టర్ శంకర్ మెగాస్టార్ చిరంజీవి ని కథానాయకుడిగా అనుకున్నారట. ఇదే విషయమై చిరంజీవిని సంప్రదించగా చిరు డేట్స్ అడ్జస్ట్ కాలేదట. దీంతో అర్జున్ తో సినిమా తీశారు శంకర్. ఒకవేళ ఈ సినిమాలో కనుక మెగాస్టార్ చిరంజీవి నటించి ఉన్నట్లయితే ఈ సినిమా ఇంకో లెవెల్ కి వెళ్లేదని టాలీవుడ్ జనాలు అభిప్రాయపడుతున్నారు.

Share post:

Latest