`ఆంటీ` అంటే అందుకే మంట‌.. హాట్ టాపిక్ గా మారిన అన‌సూయ కామెంట్స్‌!

బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్ గా గుర్తింపు సంపాదించుకున్న అన‌సూయ‌.. ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వెండితెర‌పై ఫుల్ బిజీగా మారింది. అలాగే సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అదిరిపోయే ఫోటో షూట్ల‌తో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. అయితే అన‌సూయ‌ను అభిమానించే వారే కాదు ట్రోల్ చేసే వారు ఉన్నారు.

ముఖ్యంగా కొంద‌రు నెటిజ‌న్లు ప‌నిగ‌ట్టుకుని మ‌రీ `ఆంటీ` అంటూ ఆమెను విసిగిస్తుంటారు. కానీ, ఆంటీ అని త‌న‌ను పిల‌వొద్దంటూ అన‌సూయ గ‌త కొద్ది నుంచి పెద్ద యుద్ధ‌మే చేస్తోంది. ఆంటీ అని పిలవడం కూడా వేధింపుల క్రిందికి వస్తుంది. నేను కేసు పడతా అంటూ అనసూయ హెచ్చరించింది. అయినా స‌రే కొంద‌రు నెటిజ‌న్లు పెళ్ళై ఇద్దరు పిల్లులు ఉన్న వారిని ఆంటీ అనే అంటారంటూ అన‌సూయ‌ను ఉడికిస్తుంటారు.

అయితే తాజాగా `ఆంటీ` అంటే త‌న‌కు ఎందుకు మంట అనే విష‌యాన్ని అన‌సూయ వివ‌రించింది. ఆన్ లైన్‌ ఛాట్ లో ఒక ఫ్యాన్ `అక్కా ఆంటీ అని పిలిస్తే మీకు అంత కోపం ఎందుకు?` అని అడిగాడు. దానికి `ఆంటీ అలా పిలిస్తే చాలా కోపం వస్తుంది. ఎందుకంటే వారి పిలుపు వెనుక అర్థం వేరేగా ఉంటుంది. అయితే ఈ మధ్య నాకు కోపం రావడం లేదు. ఈ ట్రోలర్స్ ని చక్కదిద్దడం కంటే ముఖ్యమైన పనులు ఎన్నో ఉన్నాయి` అంటూ అనసూయ సమాధానం ఇచ్చింది. దీంతో అన‌సూయ కామెంట్స్ కాస్త నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.