ట్రైలర్: హై వోల్టేజ్ యాక్షన్ తో అదరగొడుతున్న రామబాణం..!!

టాలీవుడ్ లో డైరెక్టర్ శ్రీవాస్ , గోపీచంద్ కాంబినేషన్లో గతంలో వచ్చిన లౌక్యం, లక్ష్యం సినిమా తరహాలోనే ఇప్పుడు తాజాగా రామబాణం సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో గోపీచంద్ అన్నయ్యగా జగపతిబాబు నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ని కూడా విడుదల చేయడం జరిగింది.ట్రైలర్ మొదలవ్వగానే ఈ క్షణం ఈ ప్రయాణం నేను ఊహించనిది కాదు ప్లాన్ చేసింది కాదు అంటూ ఈరో గోపీచంద్ ఎంట్రీ ఇస్తూ ఉంటారు.

Ramabanam: Gopichand's next with director Sriwass gets release date |  Telugu Movie News - Times of India

ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. గోపీచంద్ సరసన డింపుల్ హయాతి నటిస్తోంది. ఇందులో ఈమె ఒక యూట్యూబర్ గా కనిపించబోతోంది. వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను ,సత్య కామెడీ కూడా ఇందులో హైలెట్ గా మారనున్నాయి. సీనియర్ కమెడియన్ ఆలీ కూడా ఇందులో నటిస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా స్వచ్ఛమైన ఆహార మరియు బంధాలు ఈ రెండే మనిషిని కాపాడుతాయి అని అద్భుతమైన డైలాగుతో జగపతిబాబు పాత్ర ఇందులో చూపించడం జరిగింది.

ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు గోపీచంద్ కూడా ఈ సినిమాలు మరొకసారి మాస్ ఫాన్స్ ని అలరించబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా పాయింట్ అంతా కూడా ఫుడ్ విషయం పై కథ అన్నట్లుగా ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలోని డైలాగులు కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి.చివరిలో గోపీచంద్ చెప్పే డైలాగు కూడా థియేటర్లో హైలెట్ గా ఉండేలా కనిపిస్తోంది వారి అంచనాలు పెంచేస్తున్న ఈ సినిమాకి ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం అందుకు సంబంధించి ట్రైలర్ మాత్రం వైరల్ గా మారుతోంది.