Trailer: నెక్స్ట్ లెవెల్ లో ఏజెంట్ సినిమా ట్రైలర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్.. ఈ సినిమాపై అక్కినేని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలం తర్వాత అక్కినేని అభిమానులు సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఏజెంట్ సినిమా ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని చిత్ర బృందంతో పాటు అభిమానులు కూడా నమ్మకాన్ని తెలియజేస్తున్నారు. ఈ సినిమాని డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అఖిల్ ఒక డిఫరెంట్ లుక్కులో కనిపించబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్ పాటలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంలో అఖిల్ కు జోడిగా హీరోయిన్ సాక్షి వైద్య నటిస్తోంది. ఇప్పటికీ ఈ సినిమా ఎన్నోసార్లు విడుదల డేట్ ని ప్రకటించి వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈనెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు చిత్రా బృందం. ఈ సినిమా ట్రైలర్ యాక్షన్ సన్నివేశాలతో పూర్తిగా నింపేసినట్లు తెలుస్తోంది డైరెక్టర్ సురేందర్ రెడ్డి.

ముఖ్యంగా ఫైట్స్ సన్నివేశాలు స్టైలిష్ గా డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది ఈ చిత్రంలో అఖిల్ బీస్ట్ లుక్ హైలెట్గా నిలుస్తోంది. మలయాళం హీరో మమ్ముట్టి కూడా ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు దాదాపుగా ఈ సినిమా రూ .80 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో తెలియాలి అంటే ఈ నెల 28 వరకు ఆగల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది.