ట్రెడిషనల్ డ్రెస్‌లో మెరిసిన శ్రీముఖి.. చూస్తే మీ గుండె జారిపోతుంది!

ఒసేయ్ రాములమ్మ పాటకు వెరైటీగా డ్యాన్స్ చేయడంతో పాటు చాలా చలాకీ తనంతో బుల్లితెరపై పాపులర్ అయింది శ్రీముఖి. అభిమానులు ఈ ముద్దుగుమ్మను బుల్లితెర రాములమ్మగా కూడా పిలుచుకుంటూ ఉంటారు. తన పెద్ద గొంతుతో పాటు బీభత్సమైన హాట్ షోతో ఈ అందాల తార బుల్లితెరపై మంటలు పుట్టిస్తుంటుంది.

ఈ ముద్దుగుమ్మ స్మాల్ స్క్రీన్‌పై హైయెస్ట్ పెయిడ్ టీవీ ప్రెసెంటర్‌గా కూడా రాణిస్తోంది. 2021లో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, మాస్ట్రో వంటి సినిమాల్లో కనిపించిన శ్రీముఖి ఇప్పుడు భోళా శంకర్‌లో నటిస్తోంది. అలాగే మూడు ప్రోగ్రామ్స్‌కి యాంకర్ గా వ్యవహరిస్తోంది. మరో ప్రోగ్రామ్‌ని ప్రొడ్యూస్ కూడా చేస్తుంది. ఇలా అభిమానులకు ఎల్లప్పుడూ దగ్గరగానే ఉంటుంది.

అయితే ఈ అమ్మడు స్మాల్, సిల్వర్ స్క్రీన్‌లతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులను పలకరిస్తోంది. ముఖ్యంగా ఈ రోజుల్లో ట్రెడిషనల్ డ్రెస్సులలో దర్శనమిస్తూ అందరి కళ్లను తనవైపే తిప్పుకుంటోంది. కొద్ది గంటల క్రితమే ఈ తార బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న ఒక బ్లౌజ్, చోళిలో దిగిన ఫోటోలను పంచుకుంది వీటిలో ఈ అమ్మడు చాలా క్యూట్‌గా కనిపించింది. ఆ ఫొటోస్ అభిమానుల గుండెల్ని దోచుకుంటున్నాయి.

కళ్లకు కాటుక పెట్టుకుని, నుదుట చిన్న బొట్టు పెట్టుకొని, పాపిడి బిళ్ల ధరించి శ్రీముఖి పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయిలనే కనిపించింది. తన పెదవులకు లైట్ గా లిప్‌స్టిక్‌ వేసి ఈ అందాల తార అభిమానులను ఊరిస్తోంది. శ్రీముఖి బిగ్ బాస్ తర్వాత చాలా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ క్యూట్ బ్యూటీ కి ఫాలోవర్ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మను 47 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నారు.

Share post:

Latest