పవన్ వల్ల నలిగిపోతున్న త్రివిక్రమ్.. మహేష్‌ను ముంచేస్తున్నాడే…!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అలా వైకుంటపురంలో లాంటి సూపర్ హిట్ తరవాత మహేష్ బాబుతో SSMB28 సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి. మూడో సినిమాగా వస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడిందని ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది.ముందుగా హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి సమస్య వచ్చింది. ఆఖరికి త్రివిక్రమ్ ఏదో విధంగా ఆ సమస్యను సర్దుబాటు చేశారు.

ఆ తర్వాత సినిమా షూటింగ్ మొదలుపెట్టారు అంతలోనే మహేష్ ఇంట్లో జరిగిన వరస విషాదాలతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. సంక్రాంతి పూర్తయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా మొదలైంది. ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తి అయినట్టు తెలుస్తుంది. తాజాగా మహేష్ తన కుటుంబంతో విదేశాలకు వెళ్లి వచ్చారు.. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది.. అలాంటి ఈ సమయంలో దర్శకుడు త్రివిక్రమ్ వచ్చి మహేష్ కు షాకింగ్ విషయం చెప్పినట్టు తెలుస్తుంది.

Telugu Trivikram, Srileela, Mahesh Babu, Maheshbabu, Og, Pawan Kalyan, Ssmb-Movi

ఇటీవల ఓ మాల్ లో చేసిన హీరో, హీరోయిన్ శ్రీలీల కాంబో సీన్లు మొత్తం స్క్రాప్ చేస్తున్నట్లు త్రివిక్రమ్ చెప్పారన్నది వినిపిస్తున్న గ్యాసిప్. తనకు సంతృప్తిగా రాలేదని త్రివిక్రమ్ చెప్పడంతో హీరో కాస్త చికాకు పడినట్లు బోగట్టా. అసలు పెర్ ఫెక్ట్ గా షెడ్యూలు వేసుకుని వస్తే షూట్ కు వెళ్లడానికి తాను రెడీ అని, ఇలా ఓ అడుగు ముందుకు, ఓ అడుగు వెనక్కు అన్నది సరి కాదని కరాఖండీగా చెప్పినట్లు తెలుస్తోంది.మహేష్ సినిమా మీద సరిగ్గా దృష్టి పెట్టడం లేదనే విమర్శ ఒకటి వుంది. పవన్ కళ్యాణ్-పీపుల్స్ మీడియా సినిమా వ్యవహారాల ఫైనల్ డెసిషన్లు అన్నీ త్రివిక్రమ్ చేతుల మీదగానే జరుగుతున్నాయని టాక్ ఉంది.

Telugu Trivikram, Srileela, Mahesh Babu, Maheshbabu, Og, Pawan Kalyan, Ssmb-Movi

అలాగే పవన్ మరో సినిమా ఓజి పనులు, ఫైనల్ డెసిషన్లు అన్నీ త్రివిక్రమ్ చూసుకుంటున్నాడు అనే మరో టాక్ కూడా ఉంది. ఇవన్నీ కలిసి మహేష్ సినిమా మీద సరైన దృష్టి పెట్టలేకపోతున్నారేమో అని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు ఈ సినిమా మీద, దాని క్వాలిటీ మీద పూర్తిగా పట్టుదలగా వున్నాడు. అస్సలు రాజీపడడం లేదు. త్రివిక్రమ్ కు ఏదీ అంత సులువుగా వదిలేయడం లేదు. దీని తరువాత రాజమౌళి సినిమా వుండడంతో, మహేష్ వీలయినంత త్వరగా ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలనుకుంటున్నారు.

 Mahesh Babu Trivikram Movie Shooting Break Due To Pawan Kalyan Details, Mahesh B-TeluguStop.com

తాను సినిమా చేయడానికి రెడీగా వుంటే, త్రివిక్రమ్ కారణంగా అంతా వెనక్కి వెళ్తుంటే, తిరిగి తనను ఇలా బదనామ్ చేయడం ఏమిటి అని మహేష్ ఫీలవుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి మహేష్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఏదో జరుగుతోంది. ఇదిలా వుంటే ఈ మొత్తం వ్యవహారం మీద కీలక బాధ్యుడు సూర్యదేవర నాగవంశీని ప్రశ్నించగా, ఇవన్నీ గ్యాసిప్ లు తప్ప నీజం కాదని, మాల్ లో తీసినవి కామెడీ సీన్లు అని, అవన్నీ బాగా వచ్చాయని, ఎందుకు స్క్రాప్ చేస్తామని ప్రశ్నించారు. అతి త్వరలోనే తరువాత షెడ్యూలు ప్రారంభం అవుతుందన్నారు.

Share post:

Latest