దర్శకేంద్రుడు రాఘవేందర్ రావుకి ఆ నెంబర్ అంటే అంత భయమా.. అసలేం జరిగింది..!

చిత్ర పరిశ్రమలో ఎంతోమంది దర్శక నిర్మాతలు, హీరో హీరోయిన్లు ఏదో ఒక సెంటిమెంట్ నమ్ముతూ ఉంటారు. ఇక వారి ప్రతి సినిమా విషయంలో కూడా ఆ సెంటిమెంట్ ని ఫాలో అయ్యేలా చూసుకుంటూ వస్తారు. ఇక అదే సమయంలో వారికి ఏదైనా బ్యాడ్ సెంటిమెంట్ ఉంటే వారి సినిమాల విషయంలో ఆబ్యాడ్ సెంటిమెంట్ ఎక్కడా రిపీట్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అచ్చంగా ఇలాగే టాలీవుడ్ లో దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావుకి కూడా ఇలాంటి ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఒకటి ఉందట.

Telugu Raghavendra Rao, Friday, Malaysia, Number, Raghavendrarao, Tollywood-Movi

ఆ బ్యాట్ సెంటిమెంట్ గురించి మాట్లాడితే చాలు ఆయన భయపడిపోతూ ఉంటారు. సాధారణంగా అమెరికాలో ఎక్కువమందికి శుక్రవారం 13వ తేదీ అంటే బ్యాడ్ సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు. కానీ రాఘవేంద్రరావు కి కూడా ఇలాంటి బ్యాడ్ సెంటిమెంట్ ఒకటి ఉందట. ఇంతకీ రాఘవేందర్రావుకు 13వ తేదీ అంటే ఆయన ఎందుకు అంత భయపడతారో రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు.

Telugu Raghavendra Rao, Friday, Malaysia, Number, Raghavendrarao, Tollywood-Movi

మద్రాసులో ఉన్నప్పుడు మేమున్న అద్దె ఇళ్ల నెంబర్స్ 7, 9, 14 అని ఉండేవి. ఆ నెంబర్స్ ఇంప్రూవ్మెంట్ లాగానే నేను పనిచేసే ప్రతి ప్రొడక్షన్ హౌస్ లోనూ ఎంతో కొంత అటాచ్మెంట్, అచీవ్మెంట్స్ ఉండేవి. అందుకే ఆ రోజుల్లో ఒక్కొక్క కంపెనీలో ఐదు నుంచి ఆరు సినిమాలు చేసేవాడిని. ఒకసారి చిన్న విషయంలో ఒక నిర్మాతతో ఆర్గ్యుమెంట్లో అప్సెట్ అయ్యాను. ఆరోజు ఇంటికి నడుచుకుంటూ వచ్చాను.నాకు తెలియకుండానే కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతున్నాయి. ఇంటి గేటు దగ్గరికి వచ్చి చూస్తే అంతకు ముందు ఇంటి నెంబర్ 14 కాస్త మద్రాస్ కార్పొరేషన్ వాళ్లు 13 గా మార్చారు.

K. Raghavendra Rao: డైరెక్టర్ అవ్వకపోతే రాఘవేంద్రరావు ఏమయ్యేవారో తెలుసా..!!  | Director raghavendra rao interesting comments about his name | TV9 Telugu

నాకేమో 14వ నెంబర్ లక్కీ నెంబర్. దీంతో ఆవేశంతో ఆ నెంబర్ చెరిపేసాను. అప్పుడు మా నాన్నగారు ఏమైంది అని అడిగితే జరిగిన విషయం చెప్పాను. అయితే నిన్ను పోగొట్టుకుంటే బాధపడాల్సింది నువ్వు కాదు వాళ్లు అని ఆయన నాకు ధైర్యం ఇచ్చారు. ఇక అప్పటినుంచి ఏ హోటల్ రూమ్ తీసుకున్న నెంబర్ 13 రాకుండా చూసుకుంటాను. అప్పటి నుంచి 13వ తేదీ అంటే చాలు భయం మొదలైంది అంటూ రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు.

Share post:

Latest