సంయుక్త‌పై బాడీ షేమింగ్ కామెంట్స్‌.. అవి రెండు బాగోలేదంటూ దారుణంగా మాట్లాడారా?

బాడీ షేమింగ్‌.. సినీ తార‌లు అత్యంత స‌ర్వ సాధారంగా ఫేస్ చేసే స‌మ‌స్య‌ల్లో ఒక‌టి. టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అనిపించుకున్న సంయుక్త మీన‌న్ కూడా బాడీ షేమింగ్ ను ఫేస్ చేసింద‌ట‌. రీసెంట్ గా ఈ బ్యూటీ `విరూపాక్ష‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. కార్తీక్ వ‌ర్మ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ స‌ప్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీలో సాయి ధ‌ర‌మ్ తేజ్‌, సంయుక్త జంట‌గా న‌టించారు.

భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని.. బాక్సాఫీస్ వద్ద మంచి విజ‌యం సాధించింది. అయితే విరూపాక్ష మంచి విజ‌యం సాధించ‌డంతో ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న సంయుక్త‌.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకుంది. `విరూపాక్ష కోసం ఆడిష‌న్ కు ర‌మ్మ‌న్నారు. క‌ళ్ల‌పైనే ఆడిష‌న్ చేశారు.

ప్రేమ‌, కోపం, జాలి.. ఇలా ప్ర‌తి భావాన్ని క‌ళ్ల‌తోనే పండించాల‌ని చెప్పారు. వారు పెట్టిన టెస్ట్ లో నేను పాస‌య్యాను. అయితే కెరీర్ ఆరంభంలో కొన్ని యాడ్స్ లో న‌టించ‌న‌ప్పుడు చాలా మంది నా క‌ళ్ల‌ను విమ‌ర్శించారు. ఆ రెండు క‌ళ్లు బాగోలేద‌ని, మ‌రీ చిన్న‌గా ఉన్నాయ‌ని దారుణంగా మాట్లాడారు. ఆ టైమ్ లో నేను ఎంతో బాధ‌ప‌డ్డాను. కానీ, క‌ట్ చేస్తే ఇప్పుడు అంతా నా క‌ళ్ల గురించే మాట్లాడుకుంటున్నారు. నా న‌ట‌న‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు` సంయుక్త మీన‌న్ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Share post:

Latest