`శాకుంత‌లం` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. ఇంత దారుణంగా వ‌చ్చాయేంటి..?

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన `శాకుంత‌లం` నిన్న అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కాలిదాసు రచించిన `అభిజ్ఞాన శాకుంతలం` ఆధారంగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో స‌మంత‌, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ జంట‌గా న‌టించారు.

దిల్ రాజు, నీల‌మ గుణ నిర్మించిన ఈ చిత్రం.. ఏప్రిల్ 14న తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైంది. కానీ, అంచ‌నాల‌ను ఏ మాత్రం అందుకోలేక‌పోయింది. టాక్ అనుకూలంగా లేక‌పోవ‌డంతో తొలి రోజు బాక్సాఫీస్ వ‌ద్ద దారుణ‌మైన క‌లెక్ష‌న్స్ ను రాబ‌ట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 1.08 కోట్ల దాకా షేర్ ని అందుకోగా.. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు రూ. 2.24 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక ఏరియాల వారీగా శాకుంత‌లం ఫ‌స్ట్ డే టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 52 లక్ష‌లు
సీడెడ్: 10 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 15 ల‌క్ష‌లు
తూర్పు: 8 ల‌క్ష‌లు
పశ్చిమ: 4 ల‌క్ష‌లు
గుంటూరు: 8 ల‌క్ష‌లు
కృష్ణ: 8 ల‌క్ష‌లు
నెల్లూరు: 3 ల‌క్ష‌లు
————————————
ఏపీ+తెలంగాణ‌= 1.08కోట్లు(2.15కోట్లు~ గ్రాస్‌)
————————————

తమిళం – 22 ల‌క్ష‌లు
రెస్టాఫ్ ఇండియా – 20 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్‌- 74 ల‌క్ష‌లు
———————————————
టోటల్ వరల్డ్ వైడ్ – 2.24కోట్లు(4.70కోట్లు~ గ్రాస్)
———————————————

కాగా, రూ. 18 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసిన ఈ చిత్రం రూ. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగింది. ఈ లెక్కన మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 16.76 కోట్లు రాబ‌డితే బాక్సాఫీస్ వ‌ద్ద శాకుంత‌లం క్లీన్ హిట్ గా నిలుస్తుంది.