అమ్మ కోరిక తీర్చడానికి ఆరాటపడుతున్న జాన్వీ కపూర్..!!

బాలీవుడ్లో హాట్ బ్యూటీగా పేరు పొందింది హీరోయిన్ జాన్వీ కపూర్. ఈ ముద్దుగుమ్మ అలనాటి హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు అవుతున్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతోంది. దీంతో ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్టీఆర్ నటిస్తున్న 30వ సినిమాలో ఈమె హీరోయిన్గా ఎంపిక చేయడం జరిగింది. ఈ చిత్రంతోనే మొదటిసారిగా తెలుగు వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతోంది జాన్వీ కపూర్

When Janhvi Kapoor said how Sridevi didn't want her to be in films: 'She  thought I was naïve' | Bollywood - Hindustan Times

డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఈమె సరికొత్తగా కనిపించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో కూడా జాన్వీ కపూర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ మూవీ సెట్స్ మీద ఉండగానే ఈ ముద్దుగుమ్మ ముంబై నుంచి వచ్చి షూటింగ్లో పాల్గొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే హైదరాబాదులో కూడా బాగానే సందడి చేస్తున్నట్లు తెలుస్తోంది. సౌత్ లో మొదటి సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఈ అమ్మకు మరొక క్రేజీ ప్రాజెక్టులు నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Janhvi Kapoor gets mother Sridevi's handwritten note tattooed: 'I love you  my labbu' | Bollywood News

డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించబోతున్న సినిమాలు హీరోయిన్గా ఎంపికైనట్లు టాక్ వినిపిస్తోంది.జాన్వీ కపూర్ కూడా రామ్ చరణ్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అంతేకాకుండా ఈ చిత్రంలో మరొక హీరోయిన్ మృణాల్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని మాత్రం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. బాలీవుడ్ హీరోయిన్స్ తెలుగు పరిశ్రమకు రావడం కొత్తేమి కాదు.. గతంలో కూడా ఎంతోమంది వచ్చారు . శ్రీదేవి కూడా తెలుగు, హిందీ వంటి అనేక భాషలలో నటించి స్టార్ హీరోయిన్గా సంపాదించుకుంది. శ్రీదేవి బతికుండగానే తన కూతుర్లను వెండితెరపై చూడాలనుకుందట. ఆ కల తీరకుండానే ఆమె మరణించింది. ఇక తన తల్లి కలను నెరవేర్చేందుకు కూతుర్లు మాత్రం తెగ ఆరాటపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే పలు క్రేజీ సినిమాలలో నటిస్తున్నారు.