సినిమాల్లోకి రాక‌ముందు నిధి అలాంటి ప‌ని చేసేద‌ని మీకు తెలుసా?

నిధి అగ‌ర్వాల్‌.. ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మున్నా మైఖేల్ అనే హిందీ మూవీతో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. సవ్యసాచితో టాలీవుడ్ కు పరిచ‌యం అయింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. కానీ, నిధి గ్లామ‌ర్ షోకు మంచి మార్కులు ప‌డ్డాయి.

ఆ త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ పోతినేని హీరోగా రూపుదిద్దుకున్న `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో తొలి హిట్ ను ఖాతాలో వేసుకుని యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం నిధి అగ‌ర్వాల్ పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లు’ మరియు ప్రభాస్ తో ‘రాజా డీలక్స్’ అనే సినిమాలు చేస్తుంది. ఈ రెండు సినిమాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి.

నిధి వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే.. హైదరాబాద్ లో రిచ్ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన నిధి.. బెంగళూరు లో చ‌దువుకుంది. ఈమె హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ భాషలు అనర్గళంగా మాట్లాడగ‌ల‌దు. అలాగే నిధి తండ్రి రాజేష్ అగర్వాల్ కి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. బిజినెస్ మ్యానేజ్మెంట్ లో గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసిన నిధి సినిమాల్లోకి రాక‌ముందు తన తండ్రి వ్యాపారాలను చూసుకునేది. ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు. బిజినెస్ రంగంలో స‌త్తా చాటుతూనే ఈ అమ్మ‌డు న‌ట‌న వైపు అడుగులు వేసింది. ప్ర‌స్తుతం స‌రైన హిట్ కోసం ఈగ‌ర్ గా వెయిట్ చేస్తోంది.