అలాంటి సన్నివేశం చేసేటప్పుడు ఆపుకోలేకపోయా: కరాటే కళ్యాణి సెన్సేషనల్ కామెంట్స్‌!

ప్రముఖ హాస్యనటి, బిగ్‌బాస్ ఎక్స్‌ కంటెస్టెంట్ కరాటే కళ్యాణి గురించి తెలియని తెలుగువారు ఉండరు. కళ్యాణి 120కి పైగా సినిమాల్లో కనిపించడమే కాకుండా సీరియల్స్ లో కూడా నటించి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక చాలా వివాదాల్లో కూడా ఉంటూ అందరికీ పరిచయమైంది. బాబీ అంటూ రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌తో పాపులర్ అయిన ఈ నటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలో జరిగిన కొన్ని విషాదకర సంఘటనలు గురించి పంచుకుంది.

కళ్యాణి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను గతంలో ఆ టైప్ క్యారెక్టర్ల చేశానని.. అందుకే అన్ని విషయాల్లో నేను మాట్లాడకూడదని అంటున్నారు.” అని అన్నది. కానీ తనకు ఏ విషయం పైనైనా మాట్లాడే హక్కు ఉందని చెప్పుకొచ్చింది. అప్పుడు చేసిన క్యారెక్టర్లు ఇప్పుడు చేయడానికి మానసొప్పక సినిమాలను పూర్తిగా మానేశానని తెలిపింది. కెరీర్ కొత్తలో సీరియల్స్ చేశానని కానీ అక్కడ గుర్తింపు రాక సినిమాల్లోకి అడుగు పెట్టానని తెలిపింది. అయితే సినిమాల్లో మంచి అవకాశాలు రానప్పుడు చేసేది లేక వల్గారిటీ ఉన్న పాత్రలో చేయడానికి కూడా ఒప్పుకున్నట్లు చెప్పుకొచ్చింది.

అప్పటికీ వల్గారిటీ తక్కువ ఉన్న రోల్స్‌ మాత్రమే జాగ్రత్తగా చూసుకొని చేసేదట. అప్పట్లో ఇండస్ట్రీలో ఎవరూ కూడా తనకు సపోర్ట్ చేయలేదని దిక్కుతోచని స్థితిలో ఆ మార్గంలో వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది. ఇక అలీతో నటించిన ఒక సన్నివేశం గురించి చెప్పే అందర్నీ కంటతడి పెట్టించింది. ఆమె మాట్లాడుతూ.. “నేను ఒక సినిమాలో అలీతో ఒక సీన్​లో నటించాను. అది చేసేటప్పుడు చాలా ఇబ్బందిపడ్డాను. ఎందుకంటే ఆ సీన్‌లో చీర కొంగును జార్చేయాలి. ఆ సన్నివేశం చేసేటప్పుడు బాధను ఆపుకోలేకపోయా. అయితే అప్పుడు నాలో ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఆ సమయానికి ఆ పాత్ర నేను చేయకుంటే ఇక ఎప్పటికీ నాకు గుర్తింపు రాకపోవచ్చని, ఆ పాత్రతోనే వేరొకరు ఫేమ్‌ అవ్వచ్చని అనిపించింది అందుకే ఆ పాత్రను కూడా వదిలిపెట్టకుండా చేశాను.” అని చెప్పుకొచ్చింది.