రామ్ కథతో వ‌స్తోన్న బాల‌య్య‌… సినిమా టైటిల్ కూడా వ‌చ్చేసింది…!

నందమూరి నటసింహం బాలకృష్ణ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో మరో సినిమా పట్టాలెక్కబోతోంది. ఇంతకుముందు పైసా వసూల్. పేరుతో యాక్షన్ మూవీ చేసిన సంగతి తెలిసిందే. పైసా వసూల్ సినిమా బాలయ్య అభిమానులకు ఓ పండగ లాంటి సినిమా అని చెప్పవచ్చు. కమర్షియల్ గా ఆశించిన విజయం సాధించకపోయినా బాలయ్య అభిమానులను బాగా మెప్పించింది. అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా బాలయ్యను చూపించారు పూరి.

Puri Jagannath to work with Balayya again

అందుకనే పూరితో బాలయ్య మరో సినిమా చేయాలనుకుంటున్నారు. ఎప్పటి నుంచో ఈ క్రేజీ కాంబో వార్తల్లో ఉంది. తాజా అప్ డేట్ ఏంటంటే.. బాలయ్య- పూరితో సినిమా చేయడానికి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే అలాంటి పూరి తన తదుపరి సినిమా కోసం కథను సిద్ధం చేసుకున్నాడు. అయితే.. అందులో ఇప్పుడు పెద్ద మార్పు జరగడం గమనార్హం. ఇంతకీ ఆస‌లు విష‌యం ఏమిటంటే రామ్‌తో పూరి ఇస్మార్ట్ శంకర్ సినిమా చేశాడు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.

Puri to team up with Balayya

ఆ సినిమాకి సీక్వెల్ వస్తుంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాకు కాక అనే టైటిల్ కూడా కన్ఫామ్ చేశారని ప్రచారం కూడా జరిగింది. కాని సడన్‌గా పూరీ మ‌రో ట్విస్ట్ ఇచ్చాడు. ఈ కథను యంగ్ హీరో రామ్ తో కాకుండా బాలయ్యతో చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. కాగా ఇప్పుడు కాకాలో బాలయ్యను హీరోగా ప్రకటించడం విశేషం. మొన్నటి వరకు రామ్ కి అనుకున్న కథను బాలయ్య కోసం మార్చడం ఏంటా అనీ మ‌రో చర్చ ఇప్పుడు టాలీవుడ్ లొ మొదలైంది.

Expensive Set For NBK101

కాగా గతేడాది లైగర్‌తో గ‌టి దెబ్బ తిన్న పూరీ.. మరి బాల‌య్య సినిమాతో పామ్‌ లోకి వస్తాడేమో చూడాలి. ఇదిలా ఉండగా మరో వైపు పూరీ యంగ్ హీరో విశ్వక్ సేన్ కి కూడా ఓ కథ వినిపించినట్లు ప్రచారం కూడా జరుగుతోంది. అది కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం కూడా ఉందట. మరి ఈ రెండింటిలో ఏది ముందు తెరపైకి వస్తుందో చూడాలి.