యంగ్ హీరో నిఖిల్‌కు ఏమైంది.. ఈ నిశ్శ‌బ్దానికి కార‌ణం ఏంటి…!

యంగ్ హీరోలో సంవ‌త్స‌రానికి ఎక్కువ సినిమాలు చేసే హీరోల లిస్టులో యువ హీరో నిఖిల్ ముందు వ‌రుస‌లో ఉంటాడు. ప్ర‌తి ఏడాది నిఖిల్ నుంచి రెండు లేదా మూడు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. గ‌త సంవ‌త్స‌రం కార్తికేయ‌2 తో పాన్ ఇండియా విజ‌యం అందుకున్నా నిఖిల్ త‌ర్వాత గ‌త ఏడాది చివ‌ర్లో 18 పేజెస్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఓ మోస్త‌రు విజ‌యం అందుకున్నాడు. ఈ సినిమా వ‌చ్చి ఐదు నెలలవుతుంది. ఇంత వరకూ నిఖిల్ కొత్త‌ సినిమా సందడి క‌నిపించ‌టం లేదు.

Actor Nikhil responds to divorce rumours - TeluguBulletin.com

ఎడిట‌ర్ గ్యారీతో స్పై అనే సినిమా చేస్తున్నాడు నిఖిల్‌. గ‌తంలో ఓ అప్ డేట్ ఇచ్చి మ‌ళ్ళి ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు. అలాగే సుధీర్ వ‌ర్మ డైర‌క్ష‌న్‌లో ఓ భారీ యాక్ష‌న్ సినిమా కూడా చేశాడు. అ సినిమా షూటింగ్ కూడా పూర్తియింది. ఆ సినిమా గురించి కూడా ఎలాంటి అప్ డేట్ లేదు. మరి ఐదు నెలల్లో ఒక్క అప్ డేట్ కూడా లేకుండా నిఖిల్ ఎందుకు సైలెంట్ అయినట్టు ?

Karthikeya 2 Fame Nikhil Siddhartha Is In Huge Demand, His Next Pan-India  Film 'Spy' Bags An All-Time Highest Amount For Him In Non-Theatrical Rights?

బహుశా తాను నటిస్తున్న పాన్ ఇండియా మూవీ స్పై రిలీజ్ డేట్ లాక్ అవ్వకపోవటమే కారణమా..? ఈ సినిమాను అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు కాబట్టి సరైన డేట్ చూసి ఓ నెలపాటు భారీ ప్రమోషన్లు చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా నిఖిల్ ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెడితే బెటర్ అప్పటికి సినిమాకి కొంత హైప్ వస్తుంది. లాస్ట్ మినట్ ప్రమోషన్స్ చేస్తే త‌న గ‌త సినిమా 18 పేజెస్ ఓపెనింగ్సే రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

Share post:

Latest