ఆరోజు ఎన్టీఆర్ నా కాళ్లు పట్టుకున్నారు.. రోజా రమణి కామెంట్స్ వైరల్. !!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటీమణులలో ఒకరైన రోజా రమణి అప్పటి ప్రేక్షకులకు సుపరిచితమే.. తాజాగా ఇమే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు షాకింగ్ విషయాలను తెలియజేసింది. నటిగా డబ్బింగ్ ఆర్టిస్టుగా రోజా రమణి మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. ముఖ్యంగా భక్త ప్రహ్లాద సినిమాలో బాలనాటిగా నటించిన ఈమె ఒరియా లలో కూడా బాగానే నటించింది. ఈ తరం ప్రేక్షకులకు మాత్రం హీరో తరుణ్ తల్లిగా బాగా సుపరిచితమే.

తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపింది. ఎన్టీఆర్ అంటే తనకు చాలా అభిమానం అని తెలియజేసింది. సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించడం అదృష్టమని చెప్పుకొచ్చింది. తాతమ్మ కల సినిమాలో మొదటిసారిగా ఎన్టీఆర్ తో కలిసి నటించారని తెలుపుతోంది రోజా రమణి. ఎన్టీఆర్ ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ తో నాలుగైదు సినిమాలలో నటించానని తెలిపింది ఒక సినిమా షూటింగ్లో భాగంగా ఆత్మహత్య చేసుకోవడానికి నేను పరిగెత్తుతూ ఉండగా ఆగు చెల్లెమ్మ అంటూ హరికృష్ణ వెనకనే వస్తూ ఉంటారట.

ఇక సీనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ అని రోజా రమణి చెప్పుకొచ్చింది. కృష్ణ బ్యారేజ్ రైలింగ్ పై.. కాళీ క్యాన్ల మీద నిలబడ్డారని ఆ క్యాన్లు ఊగుతూ ఉండడంతో రామారావు వచ్చి తన కాళ్లు పడిపోకుండా పట్టుకున్నారని తెలుపుతోంది రోజా రమణి. అయితే ఆ సమయంలో కొంచెం అజాగ్రత్తగా ఉంటే కచ్చితంగా సూసైడ్ జరుగుతుందని రోజా రమణి తెలియజేసింది. కొన్ని వేల మంది జనం అక్కడ ఉన్నప్పటికీ రామారావు గారు తన కాళ్లు పట్టుకున్నారని రోజా రమణి తెలిపింది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

Share post:

Latest