పండంటి బిడ్డకి జన్మనిచ్చిన పూజా రామచంద్రన్‌.. ఆ విల‌న్ ఇంట్లో సంబ‌రాలు!

ప్ర‌ముఖ న‌టి, బిగ్ బాస్ బ్యూటీ పూజా రామ‌చంద్ర‌న్ త‌ల్లి అయింది. తాజాగా ఆమె పండంటి మ‌గ బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చింది. చ‌దువుకుంటున్న రోజుల్లోనే `మిస్‌ కొయబత్తూర్‌ 2004` టైటిల్‌ విన్నర్‌గా నిలిచిన పూజా.. ఆ త‌ర్వాత వీడియో జాకీగా, మోడల్‌గా, అట్నుంచి నటిగా మారింది. కోలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ అమ్ముడు.. `లవ్ ఫెయిల్యూర్` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది.

`స్వామి రా రా`తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో అనేక చిత్రాలు చేసిన పూజా.. బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 2లో కూడా పాల్గొంది. ఇక‌పోతే 2019లో జాన్ కొక్కేన్‌ను పూజా వివాహం చేసుకున్న‌ది. ఇత‌డు కూడా న‌టుడే. విల‌న్ గా తెలుగు, మ‌ల‌యాళ భాష‌ల్లో చాలా సినిమాలు చేశాడు. అయితే గ‌త ఏడాది పూజా భ‌ర్త‌తో దిగిన రొమాంటిక్ ఫోటోల‌ను పంచుకుంటూ త‌న ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది.

తాజాగా ఆమె పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని జాన్‌ కొక్కెన్‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కుమారుడి వేలు ప‌ట్టుకుని ఉన్న ఫోటోను పంచుకున్నారు. అలాగే త‌న‌యుడికి `కియాన్‌ కొక్కెన్‌` అనే పేరు పెట్టినట్టు వెల్లడించారు. `మా హృదయాలను, జీవితాలను ఆనందంతో నింపడానికి మా లిటిల్‌ బాయ్‌ వచ్చాడు. ఈ ప్రపంచంలోకి కియాన్‌ కొక్కెన్‌కు స్వాగతం. మీ అందరి ప్రేమ, ప్రార్థనలకు ధన్యవాదాలు` అని పేర్కొన్నారు. మొత్తానికి పూజా పండంటి బిడ్డ‌కు జ‌న్వ‌నివ్వ‌డంతో జాన్ కొక్కెన్ ఇంట్లో సంబ‌రాలు చేసుకుంటున్నారు.

Share post:

Latest