పోసానిపై పై సంచలన వ్యాఖ్యలు చేసిన యాక్టర్ శివాజీ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోలలో నటుడు శివాజీ కూడా ఒకరు.ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించారు. ఇప్పటితరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. శివాజీ సైతం అప్పుడప్పుడు చేసే విమర్శలు కాస్త ఘాటుగా ఉంటాయని చెప్పవచ్చు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం పెను సంచలనాలకు దారితీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కు రాజధానిలేదని శివాజీ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు మానసికంగా చనిపోయారంటూ కూడా కామెంట్ చేశారు.

Posani Krishna Murali fights third bout of COVID-19; admitted to hospital  in Hyderabad | Telugu Movie News - Times of India
రాజకీయ నాయకులు ప్రతిదానికి కూడా బానిసత్వాలు చేస్తుంటారని తన అభిప్రాయంగా తెలిపారు. కులం అనేది సమాజాన్ని పద్ధతిగా పెట్టడం కోసమే అంటూ కూడా తెలిపారు సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వచ్చిన సమయంలో కుల వ్యవస్థ లేదని తెలిపారు.ఏపీ అసెంబ్లీలో మాట్లాడే స్వేచ్ఛ లేదని కూడా తన అభిప్రాయంగా తెలియజేయడం జరుగుతోంది .ఇక సినీ ఇండస్ట్రీలో ఉండే నటుడు పోసాని కృష్ణ మురళి లాంటి పెద్ద వాళ్ల గురించి నేను మాట్లాడనని కామెంట్లు చేశారు.

Actor Sivaji: conspiracy to topple Naidu govt | Deccan Herald

అంతేకాకుండా తనెవరో కూడా తెలియదని పోసాని అనడంతో తను కూడా ఎవరో నాకు తెలియదంటూ కూడా తెలియజేశారు నటుడు శివాజీ. రాజ శేఖర్ రెడ్డి గారు అవార్డు కూడా ఇచ్చారని శివాజీ తెలియజేయడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా నంది అవార్డు వచ్చిందని అందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని తెలిపారు శివాజీ… ప్రజలు అర్థం చేసుకోవాలని నేను చెబుతున్నానని మంచి ఏదో చెడు ఏదో ప్రజలే తెలుసుకోవాలని తెలిపారు. శివాజీ చేసిన ఈ వాక్యలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇప్పటివరకు తను ఏ సినిమాలలో నటిస్తున్నాడని విషయాన్ని మాత్రం తెలియజేయలేదు.