పుష్ప గా మారిన ముక్కు అవినాష్.. బన్నీ ఫ్యాన్స్ ఫైర్..!!

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం పుష్ప -2. సుకుమార్ ఈ సినిమాని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మొదటి భాగం విడుదలై ఇప్పటికి రెండు సంవత్సరాలు కావస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించడం జరిగింది. ఇప్పుడు సీక్వెల్ ని కూడా అదే స్థాయిలో తెరకెక్కిస్తున్నారు సుకుమార్ .ఇందులో హీరోయిన్గా రష్మిక నటిస్తోంది.ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమై శరవేగంగా జరుపుకుంటోంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు చిత్ర బృందం.

పుష్ప -2 మేకర్స్ ఒక స్పెషల్ వీడియో తో పాటు బన్నీ లుక్కుని కూడా రివీల్ చేయడం జరిగింది.దీంతో ఈ సినిమా పైన మరింత హైప్ నెలకొంది. ముఖ్యంగా చీర కట్టులో ఉన్నటువంటి ఫోటోతో పాటు అందులో ముక్కుపుడకతో గంగమ్మ అవతారంలో కనిపించిన అల్లు అర్జున్ చూసి అభిమానులు తెగ ఆకట్టుకోవడం జరిగింది. తాజాగా ఈ విషయంలోనే అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహానికి కూడా గురి కావడం జరుగుతోంది. ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ చేసిన పని వల్ల అభిమానులు సైతం ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో ట్రెండీగా ఉన్న పుష్ప-2 లుక్ నీ ఇమిటేట్ చేశాడు కమెడియన్ అవినాష్.. తనకు తోచిన విధంగా ఎడిటింగ్ తో బన్నీ లుక్కుని కాస్త మార్ఫింగ్ చేసి తన ఫోటోని పెట్టుకున్నాడు అనంతరం దీనిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి అల్లు అర్జున్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కి ఆగ్రహాన్ని తెప్పించాలా చేసింది. ఆ ఎడిటింగ్ ఇష్టం వచ్చినట్లు చేసి ఫోటో మార్కింగ్ చేయడం వల్ల.. నువ్వు పక్కింటి మంగమ్మలా ఉన్నావ్ అంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. దీంతో వెంటనే ఆ ఫోటోని డిలీట్ చేయాలి అంటూ వార్నింగ్ ఇవ్వడంతో డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Mukku Avinash (@jabardasth_avinash)