`శాకుంత‌లం` హీరో దేవ్ మోహ‌న్ వ‌య‌సులో స‌మంత కంటే ఎన్నేళ్లు చిన్న‌వాడో తెలిస్తే షాకే?

స‌మంత, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ జంట‌గా న‌టించిన‌ `శాకుంత‌లం` విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శ‌కుంత‌ల‌గా స‌మంత‌, దుష్యంత మహారాజుగా దేవ్ మోహ‌న్ న‌టించారు. గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కించిన ఈ అద్భుత‌మైన ప్రేమ కావ్యం ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది.

అయితే ఈ సినిమాలో హీరోగా న‌టించిన దేవ్ మోహ‌న్ కు తెలుగులో ఇదే తొలి చిత్రం. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, సాంగ్స్‌, టీజ‌ర్, ట్రైల‌ర్ ద్వారా దేవ్ మోహ‌న్ లుక్స్‌, న‌ట‌న ప‌రంగా అంద‌రినీ ఆక‌ర్షించాడు. ఇక్క‌డ అస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. స‌మంత కంటే దేవ్ వ‌య‌సులో చాలా చిన్న‌వాడు. వీరిద్ద‌రి మ‌ధ్య ఏజ్ గ్యాప్ తెలిస్తే షాకైపోతారు. దేవ్ మోహన్ 1992 సెప్టెంబర్ 18న కేరళలోని త్రిస్సూర్ లో జన్మించారు. అంటే స‌మంత కంటే వ‌య‌సులో ఐదేళ్లు చిన్న‌వాడు.

సినిమాల్లోకి మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన దేవ్ మోహ‌న్ బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. జాబ్ చేస్తూనే మోడలింగ్ లోకి వ‌చ్చాడు. దేవ్ మోహ‌న్ తొలి చిత్రం సూఫియుం సుజాతయుమ్`. 2020లో ఓటీటీలో ఈ చిత్రం విడుద‌లైంది. ఈ సినిమాలో దేవ్ న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఆ త‌ర్వాత హోమ్‌, పాత్రాండు చిత్రాల్లో న‌టించాడు. ఈ మూడు సినిమాల అనుభ‌వంతోనే దేవ్ మోహ‌న్ శాకుంత‌లంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.