SSMB -28 .. అదిరిపోయే లుక్ లో రిలీజ్ డేట్ లాక్..?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం నుంచి అప్డేట్ రానే వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సినిమా గురించి చెప్పాల్సిన పనిలేదు దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఈ చిత్రం రాబోతున్నది. ఈ సినిమాని యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని కొందరు అంటుంటే మరి కొంతమంది మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం అని తెలియజేస్తున్నారు. ఈ సినిమా నుంచి లీకైన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

Bangalore SSMB Fans on Twitter: "Ah style and swag chudu thamudu 😎🔥  #SSMB28 @urstrulyMahesh #MaheshBabu https://t.co/5SkpUgKTRF" / Twitter

ఈ చిత్రం నుంచి సాలిడ్ లుక్ లో మహేష్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం జరిగింది మేకర్స్.. మేకర్ చెప్పిన విధంగానే మహేష్ బాబు సరికొత్త మాస్ అవతారంలో కనిపించబోతున్నట్లు ఈ పోస్టర్ చూస్తే మనకి అర్థమవుతోంది.. ఇది మిర్చి యార్డులో జరిగే ఒక యాక్షన్ సన్నివేశం అన్నట్లుగా కనిపిస్తోంది. మిర్చి యార్డులో కొందరికి బుద్ధి చెప్పి.. కళ్లద్దాలు నోటిలో సిగరెట్ పెట్టుకొని ఎంతో స్టైలిష్ గా నడుస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది.

Hemanth Kiara on Twitter: "2023 Pongal ki Chiru Waltair ke bayapadi July ki  paaripoyinodu 2024 Pongal ki vachedi SSMB , esari kuuda no doubt pakka  paaripothaadu rebelodu #SSMB28 https://t.co/omGjvyjbLr" / Twitter

ఈ మహేష్ బాబు మాస్ లుక్ లో ఆకట్టుకుంటూ ఉండగా అభిమానులు చాలా సంబరపడిపోతున్నారు. మొత్తానికి ఈ సినిమా వచ్చే సంక్రాంతికి మహేష్ త్రివిక్రమ్ కలిసి మాస్ బొమ్మ చూపించబోతున్నారని పోస్టర్తోనే అర్థమవుతోంది.. ఇక మహేష్ బాబు సినిమాలకు సంక్రాంతి సెంటిమెంట్ భారీగానే ఉంది.. గతంలో మహేష్ నటించిన ఒక్కడు సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలు సంక్రాంతికి విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. మరి ఎస్ ఎస్ ఎం బి -28 చిత్రం ఎలాంటి రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి మరి. ఇందులో హీరోయిన్ గా పూజ హెగ్డే, శ్రిలీల నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి టైటిల్ సెట్ చేయలేదు.

https://twitter.com/haarikahassine/status/1639975490185461760?s=20