రావణాసుర ట్రైలర్: యాక్షన్, కామెడీ, మిస్టరీ.. ఒకటేంటి హోల్ కమర్షియల్ ప్యాకేజీతో వస్తోన్న రవితేజ!!

మాస్ మహారాజా రవితేజ, సుధీర్ వర్మ కాంబోలో రూపొందిన రావణాసుర మూవీ ఏప్రిల్ 7న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే టీజర్, పోస్టర్లతో అభిమానుల్లో హైప్‌ పెంచేసిన ఈ సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ తాజాగా హై-అక్టేన్‌ ట్రైలర్‌తో అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. గంట క్రితమే రిలీజ్ అయిన ఈ ట్రైలర్ లక్షల వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్గా నిలుస్తోంది. గూస్‌బంప్స్‌ కలిగించే బిజిఎంతో.. బుల్లెట్లు, పిడుగుల వర్షంతో ట్రైలర్ ఇంట్రోనే అదరగొట్టేసింది. ఆ తర్వాత రవితేజ డైలాగులు తూటాల్లా పేలాయి. ఒక్క వైలెన్స్ మాత్రమే కాకుండా కిక్ ఇచ్చే లవ్ స్టోరీ కూడా ఉన్నట్లు ఈ ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది.

ఈ మూవీలో రవితేజ క్రిమినల్ లాయర్‌గా అవతారం ఎత్తాడు. హైపర్ ఆదితో కలిసి తనదైన శైలిలో కామెడీ చేయడం, అంతేకాకుండా హీరోయిన్‌తో కలిసి ఓ రేంజ్‌లో సరసాలు ఆడటం కనిపించింది. రవితేజ పాత్ర మల్టిపుల్ షేడ్స్‌తో ఉంటుందని ట్రైలర్ ప్రకారం తెలుస్తోంది. ఇక ట్రైలర్‌లో వినిపించిన “వాడు క్రిమినల్ లాయర్ కాదు, లా చదివినా క్రిమినల్” వంటి డైలాగులు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. మర్డర్ మిస్టరీ ట్రైలర్‌ చివరిలో హైలైట్ అయింది. డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో కలబోసి మంచి ఎంటర్టైనింగ్ థ్రిల్లర్ గా దీన్ని తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, యాక్షన్ సీన్స్ అన్నీ కూడా మూవీ పై ఆసక్తిని కలిగిస్తున్నాయనటంలో సందేహం లేదు.

ఇకపోతే ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షనాగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. అక్కినేని సుశాంత్ ప్రతినాయకుడి పాత్రను పోషించాడు. హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ మూవీలో రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, RT టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.