భ‌ర్త‌తో విభేదాలు.. నిహారిక తాజా పోస్ట్ తో మ‌రింత పెరిగిన అనుమానాలు!

నాగ‌బాబు కూతురు, మెగా డాట‌ర్ నిహారిక వైవాహిక జీవితం గురించి గ‌త కొద్ది రోజుల నుంచి ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. మూడేళ్ల క్రితం నిహారిక జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌ను వివాహం చేసుకుంది. అయితే వీరి మ‌ధ్య ఇటీవ‌ల మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్తాయ‌ని.. అవి విడాకుల వ‌ర‌కు వెళ్లాయ‌ని ప్ర‌చరం జ‌రుగుతోంది.

అదే స‌మ‌యంలో ఒక‌రినొక‌రు సోష‌ల్ మీడియాలో అన్ ఫాలో చేసుకోవ‌డం, చైత‌న్య త‌న ఇన్‌స్టాగ్రామ్ లో త‌మ పెళ్లి ఫోటోలు, నిహారికకు సంబంధించిన ఫోటోల‌న్నీ తొల‌గించ‌డం వంటి అంశాలు నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చారానికి మ‌రింత బ‌లాన్ని చేకూర్చింది. అయితే తాజాగా నిహారిక తాజా పోస్ట్ తో ఆమె వైవాహిక జీవితంపై అనుమానాలు మ‌రింత పెరిగాయి.

నిహారిక ప్ర‌స్తుతం జిమ్ వర్కౌట్స్ చేస్తూ తన ఫిజిక్ ని కాపాడుకునే పనిలో ఉంది. తాజాగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఫొటోస్ ని పంచుకుంది. త‌న జిమ్ ట్రైన‌ర్ తో పాటు ఫ్రెండ్ తో వితిక షెరుతో క‌లిసి దిగిన పిక్స్ ను షేర్ చేసింది. అయితే గతంలో నిహారిక తన భర్త చైతన్యతో కలసి జిమ్ వర్కౌట్స్ లో పాల్గొనేది. ఈ పిక్స్ ను కూడా షేర్ చేసేది. కానీ ఇప్పుడు నిహారిక ఒంటరిగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తుంద‌ని తాజా పిక్స్ తో తేలిపోయింది. దీంతో భ‌ర్త‌తో ఆమెకు విభేదాలు నిజ‌మే అని చాలా మంది చ‌ర్చించుకుంటున్నారు.