మహేష్ ఒకో చిత్రానికి ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా..?

టాలీవుడ్ లోకి ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ మహేష్ క్రేజ్ మాత్రం మారదు. సూపర్ స్టార్ మహేష్ కృష్ణ తనయుడిగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అమ్మాయిలైతే అలాంటి వ్యక్తి లైఫ్ పార్ట్నర్ కావాలని కోరుకుంటూ ఉంటారు… ఒకప్పుడు మహేష్ బాబు చేసిన సినిమాలతో ఫ్లాపులను చవిచూశారు.. కానీ ఇప్పుడు పాత్రని ఎంచుకోవడం విషయంలో ఆచి చూచి అడువేయటం వల్ల అన్ని సక్సెస్లే సాధిస్తున్నాడు మహేష్ బాబు.

SSMB28 First look: Mahesh Babu's Film Gets A Release Date

అయితే ఇప్పుడు మహేష్ బాబు ఒక్కొక్క సినిమాకి ఎంత పారతోషికం తీసుకుంటున్నారు అనే విషయం తెలుసుకుందాం. మహేష్ బాబు దాదాపు రూ .70 నుంచి రూ.80 కోట్ల పారతోషకం తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. అయితే మహేష్ బాబు సగం రెమ్యునరేషన్ తీసుకొని మిగతా సగం రెమ్యూనరేషన్ తన వాటా కింద సినిమాల్లోకి పెట్టుబడి పెడతారని సమాచారం..అలాంటి సినిమాలకు జిఎంబి ఎంటర్టైన్మెంట్ సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉంటుంది.

అయితే కొన్ని సినిమాలకు మాత్రం మహేష్ బాబు పూర్తిగా రెమ్యూనరేషన్ తీసుకుంటారట.మహేష్ బాబు కొన్నింటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తు ఉంటారు. ఇక ఆయా బ్రాండ్స్ కు సంబంధించిన ప్రొడక్షన్స్ ప్రమోట్ చేస్తూ కొన్ని యాడ్స్ కూడా చేస్తుంటాడు. గడచిన కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూల్ డ్రింక్ యాడ్స్ నుండి బాంబినో యాడ్స్ వరకు మహేష్ బాబు కనిపిస్తున్నాడు.

అలా యాడ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తూనే దాదాపు రూ .10కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మొత్తానికి మహేష్ బాబు రెమ్యునరేషన్ చూస్తూ ఉంటే ఆశ్చర్య పోయేలా కనిపిస్తోంది. ఎందుకంటే మిగతా హీరోస్ లాగా మహేష్ బాబు పాన్ ఇండియా హీరోగా అవ్వలేదు. కానీ ఆయన డిమాండ్ చేసినంత ఇస్తున్నారు.