సంతోషం సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ సైతం ఆడప దడప సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన వారు చాలామందే ఉన్నారు  అలా నాగార్జున నటించిన గీతాంజలి సినిమాలో హీరోయిన్ గిరిజ మొదలు అలా ఒక్క సినిమాతోనే పాపులర్ అయిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. నాగార్జున నటించిన సంతోషం సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఇందులో హీరోయిన్గా శ్రీయతో పాటు గ్రేసి సింగ్ నటించింది.. ఆమె ఉండేది కాసేపైనప్పటికీ తన అందంతో అభినయంతో అందరిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
The Lost Heroine - Gracy Singh - YouTube
ముఖ్యంగా గ్రేసి సింగ్ కనిపించే సన్నివేశాలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఆమె అభిమానాన్ని చూసి మరికొన్ని తెలుగు సినిమాలలో నటిస్తుందనుకున్నారు అభిమానులు.. అయితే అలాంటిదేమీ జరగలేదు ఆ తర్వాత మోహన్ బాబు, శ్రీకాంత్ హీరోలుగా వచ్చిన తప్పుచేసి పప్పుకూడు సినిమాలో హీరోయిన్గా నటించింది ఇదే ఈమెకు చివరి తెలుగు సినిమా.. ఆ తర్వాత తమిళ్, మలయాళం, పంజాబ్ వంటి భాషలలో అవకాశాలు రావడంతో ఇక అక్కడే సెటిల్ అయిపోయింది.
Santosham Movie Video Songs - Nuvvante Ishtamani - Nagarjuna, Gracy Singh -  YouTube
హిందీలో అమీర్ ఖాన్ తో ఒక సినిమా మున్నాభాయ్ వంటి సినిమాలలో నటించింది. ఆ తర్వాత చాలా కాలానికి రామ రామ కృష్ణ కృష్ణ అనే తెలుగులో యాక్షన్ కింగ్ అర్జున్ సరస న ఒక కీలకమైన పాత్రలో నటించింది. 2015లో ఒక పంజాబీ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ కు దూరమైంది ప్రస్తుతం ఈమె వయసు 42 సంవత్సరాలు ఈమె పెళ్లి కూడా చేసుకోలేదు.. అయితే ఈమెకు భరతనాట్యం డాన్స్ అంటే చాలా ఇష్టము తన పేరిట గ్రేసీ సింగ్ డాన్స్ అంటూ ఒక ట్రస్ట్ ని ప్రారంభించింది. ఇక సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండదు గ్రెసి సింగ్ ఈమెకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.