విడాకులు తీసుకున్న హీరోతో పెళ్లికి సిద్ధ‌మైన మీనా.. ఇంత‌కంటే క్లారిటీ కావాలా?

ప్ర‌ముఖ న‌టి మీనా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళ భాష‌ల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె.. ప్ర‌స్తుతం స‌హాయ‌క పాత్ర‌ల‌ను పోషిస్తూ స‌త్తా చాటుతోంది. ఇక‌పోతే గ‌త ఏడాది మీనా భ‌ర్త విద్యా సాగ‌ర్ అనారోగ్యంతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఈ విషాదం నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం కోసం మీనా భ‌ర్త చ‌నిపోయిన కొద్ది నెల‌ల‌కే మ‌ళ్లీ షూటింగ్స్‌లో బిజీ అయ్యారు.

ఈ త‌రుణంలో మీనా రెండు పెళ్లికి సిద్ధ‌మైదంటూ ఇప్ప‌టికే ప‌లు మార్లు వార్త‌లు రాగా.. వాటిని ఆమె ఖండించింది. తాజాగా మ‌రోసారి ఇలాంటి వార్తే నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. ఓ త‌మిళ స్టార్ హీరోను మీనా రెండో వివాహం చేసుకోబోతోంద‌ని ఓ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. అయితే త‌మిళ హీరోగా ఆల్రెడీ పెళ్లి జ‌రిగింద‌ట‌. అంతేకాదు కొద్ది రోజుల క్రిత‌మే అత‌ను త‌న భార్యకు విడాకులు ఇచ్చి ఒంట‌రిగా ఉంటున్నాడ‌ట‌.

మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. స‌ద‌రు స్టార్ హీరో మీనా కంటే చిన్న‌వాడ‌ట‌. అయిన‌ప్ప‌టికీ అభిప్రాయాలు క‌ల‌వ‌డంతో స‌ద‌రు స్టార్ హీరోను మీనా పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారంటూ ఓ తమిళ యూట్యూబర్ వీడియోను వ‌దిలాడు. దీంతో ఈ విష‌యం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వార్త‌ల‌ను మీనా ఖండించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. `ఇలాంటి త‌ప్పుడు వార్తలు ఎలా రాస్తారో అర్థం కావడం లేదు. నా భర్త లేర‌న్న విషయాన్ని ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నా. ప్రస్తుతానికి సినిమాల్లో నటించడంపైనే దృష్టి సారిస్తాను. అలాగే నా కూతురికి మంచి భవిష్యత్తును కల్పించడంలో సహాయం చేయడం నాకు చాలా ముఖ్యం` అంటూ మీనా ఫుల్ క్లారిటీ ఇచ్చింది.