అతడితో డేటింగ్ లో మునిగితేలుతున్న స్టార్ సెలబ్రిటీ.!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు మాత్రమే కాదు వారి బంధువులు ,కుటుంబ సభ్యులు కూడా ఇండస్ట్రీలో పాపులారిటీ దక్కించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలీవుడ్ లో చాలామంది డేటింగ్ పేరిట హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు బాలీవుడ్ యువ హీరో అర్జున్ కపూర్ వయసు తో తారతమ్యం లేకుండా మలైకా అరోరా ఖాన్ తో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ జంట అధికారికంగా పబ్లిక్ లో షికారులు చేస్తూ మీడియాలో నిరంతరం హాట్ టాపిక్ గా మారుతున్నారు.

PIC: Anshula Kapoor makes her relationship with Rohan Thakkar official;  Janhvi Kapoor, Athiya Shetty react | PINKVILLA

ఇక త్వరలోనే ఈ జోడి పెళ్లికి కూడా సిద్ధమవుతున్నారన్న కథనాలు వస్తున్నాయి. ఇంతలోనే అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్ కూడా తన ప్రియుడిని పరిచయం చేస్తూ తన ప్రేమను అధికారికం చేసింది. అగ్ర నిర్మాత బోని కపూర్ కుమార్తె… అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్ స్క్రీన్ రైటర్ రోహన్ థక్కర్ తో డేటింగ్ చేస్తున్నట్లు చాలాకాలంగా పుకార్లు వినిపించాయి. కానీ ఇప్పటివరకు దానిని అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు. అయితే ఇన్స్టా లో వీరిద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించే ఫోటోలను చాలాసార్లు షేర్ చేసినా సరే ఇరువైపుల నుంచి ఎటువంటి ధృవీకరణ లేదు..

Anshula Kapoor makes her relationship with Rohan Thakkar Insta official

కానీ ఇటీవల తెల్లవారుజామున రోహన్ తో స్విమ్మింగ్ పూల్ లో రొమాంటిక్గా ఉన్న ఫోటోని అన్షుల స్వయంగా షేర్ చేయడంతో ఇక ఆ ఇద్దరి మధ్య బంధం అధికారం అయ్యింది అని తెలుస్తోంది . ఇన్స్టాలో షేర్ చేసిన ఈ ఫోటోకి హార్ట్ ఎమేజీతో 366 అని అన్షులా క్యాప్షన్ ఇచ్చింది. అంతేకాదు మాల్దీవుల్లో రిసార్ట్ లొకేషన్ ని కూడా ఆమె ట్యాగ్ చేసింది. అక్కడ సినీ ప్రియుడు రోహన్ తో డేటింగ్ మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఒకరికొకరు ప్రేమగా చూసుకుంటూ కనిపిస్తున్న ఫోటో నెటిజన్లను వైరల్ చేస్తున్నారు.