నాగచైతన్య- శోబిత ప్రేమ కథ ముందుకు వెళ్తుందా..!!

నాగచైతన్య, సమంత విడిపోయినప్పటి నుంచి వీరిద్దరి మీద పలు రకాలుగా రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా నాగచైతన్య గత కొద్ది రోజులుగా హీరోయిన్ శోభిత ధూళిపాళ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ముంబైలో వీరిద్దరూ ఒక అపార్ట్మెంట్లో కలిసి ఉంటున్నారని షూటింగ్స్ కు అప్పుడప్పుడు నాగచైతన్య హైదరాబాద్ కి వచ్చి వెళుతున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నాగచైతన్య పలు సినిమాలతో బిజీగా ఉన్నారు కస్టడీ సినిమాతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.

Naga Chaitanya's new photo with rumoured gf [Viral]
మరి కొంతమంది మాత్రం సమంతాతో విడిపోయినప్పటి నుంచి నాగచైతన్య పెళ్లి ప్రస్తావన అసలు తీసుకు రాలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇలాంటి సమయంలోనే శోభితతో ప్రేమలో పడడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే వీరిద్దరూ ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా అధికారికంగా ప్రకటించలేదు. మొత్తానికి అక్కినేని వారి కుటుంబంలో శోభిత ధూళిపాళ అడుగుపెట్టబోతోంది అనే వార్తలు అక్కినేని అభిమానులను కన్ఫ్యూజన్లో పడేసాయని చెప్పవచ్చు. తాజాగా వీరి ప్రేమ వ్యవహారం గురించి సరికొత్త ప్రచారం మొదలవుతోంది.

Naga Chaitanya Has THIS Response When Quizzed About Rumoured GF Sobhita  Dhulipala - Filmibeat
అదేమిటంటే నాగచైతన్య, శోభిత యొక్క ప్రేమ వ్యవహారం గురించి ఇరువురు కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సమంతతో బ్రేకప్ తర్వాత నాగచైతన్య పెళ్లి చేసుకోకపోవచ్చు అనుకుంటున్న సమయంలో ఇలా పెళ్లికి ఒకే చెప్పడంతో కుటుంబ సభ్యులు మొత్తం హ్యాపీగా ఉన్నట్లు అక్కినేని వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హీరోయిన్ శోభిత కూడా అక్కినేని ఇంట కోడలు కాబోతున్న సందర్భంలో ఆమె కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంలో కాస్త సంతృప్తి గానే ఉన్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై నాగచైతన్య ,శోభిత ఎలా స్పందిస్తారో చూడాలి మరి.