సమంత శాకుంతలం రిలీజ్ డేట్ లాక్..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన సమంత గత ఏడాది మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలియజేసింది. ఇక ఇలాంటి సమయంలో కూడా సమంత యశోద సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది.. ఇక ఈ ఏడాది శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా ఈనెల 17వ తేదీన విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల చేత ఈ సినిమా వాయిదా పడ్డట్టుగా కూడా వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా విడుదల తేదీ ప్రకటించినట్లు తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.

Shaakuntalam - Wikipedia
శాకుంతలం సినిమా డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సమ్మర్ లో ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో సమంత శాకుంతలా గా నటిస్తోంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ,టీజర్, సాంగ్స్ పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ గుణ టీమ్ వర్క్ పదార్థాలపై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 3d టెక్నాలజీ తో పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నారు.

New release date for Samantha-Devmohan movie Shakunthalam | സാമന്ത -  ദേവ്‌മോഹന്‍ ചിത്രം ശാകുന്തളത്തിന് പുതിയ റിലീസ് തീയതി | Mangalam
ఒకేసారి తెలుగు, తమిళ్, హిందీ,మలయాళం భాషలో విడుదల చేయబోతున్నారు. ఇందులో కీలకమైన పాత్రలు మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ ,మధుబాల ,అదితి బాలన్ ,అనన్య నాగళ్ళ తదితరులు నటిస్తూ ఉన్నారు. ఇందులో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హత కూడా భరతుడి పాత్రలో నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో సమంత అభిమానులు కాస్త ఆనందాన్ని తెలియజేస్తున్నారు.