అలియా! నీ భర్త కామపిశాచి జాగ్రత్త: కంగనా

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చెప్పాలంటే బాలీవుడ్లో ఆమె ఓ సంచలనం. అత్యంత పేదరికమైన కుటుంబం నుండి వచ్చిన ఆమె నేడు బాలీవుడ్ క్వీన్ గా అవతరించింది అంటే దాని వెనకాల ఈమె నిరంతర శ్రమ, అకుంఠిత దీక్ష, పట్టుదల కారణం అని చెప్పుకోవాలి. ఆమె ముక్కుసూటుతనానికి మారుపేరు అని చెప్పుకోవాలి. ఏం చెప్పాలనుకుంటుందో అది చెప్పేస్తుంది. ఎదుట ఎంత పెద్ద వ్యక్తులైనా సరే తన మనసులో అనుకున్న మాటను బయటకు చెప్పడంలో ఏమాత్రం సంకోచించదు.

ఈ క్రమంలోనే మరోసారి తన మాటతీరుతో రెచ్చిపోయింది అమ్మడు. ఎలాంటి సినిమా నేపధ్యం లేని కంగనా బాలీవుడ్లో మంచి మంచి సినిమాలు చేసి భారీగా పాపులారిటీ అందుకుంది. ఈ క్రమంలో ఆమె పలు నేషనల్ అవార్డులను కూడా అందుకుంది. ఇటీవలే ఆమెను పద్మశ్రీ అవార్డు వరించిందని మీరు వినే వుంటారు. ఇకపోతే ఎప్పుడూ తన సూటైన మాటలతో బాలీవుడ్ బడాబాబుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే కంగనా తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ గురించి చేసిన కామెంట్లు ఇపుడు వైరల్ అవుతున్నాయి.

పిలవకుండానే తన ఇంటికి వచ్చి తనపై బలవంతం చేయడానికి యత్నించాడని, పేరు బయట పెట్టకుండానే మంట పెట్టింది. కానీ ఆమె రణబీర్ కపూర్ గురించి మాట్లాడుతోందని ఇట్టే మనకు తెలిసిపోతుంది. దాంతో సోషల్ మీడియాలో కూడా చాలామంది కధలు కధలుగా చెప్పుకుంటున్నారు. రణబీర్ అద్దె మనుషులు తనను ఫాలో అవుతున్నారని, తాను వెళ్లిన ప్రతిచోట ఫోటోగ్రాఫర్లను ఫాలో అవుతున్నారని అందువల్ల తాను అసౌకర్యంగా భావిస్తున్నాను అంటూ కూడా ఆమె చెప్పకు రావడం కొసమెరుపు. ఈ తరుణంలోనే రణబీర్ కపూర్ భార్య అలియాకి ‘నీ భర్త కామపిశాచి జాగ్రత్త!’ అంటూ ఉచిత సలహాలు ఇస్తోంది. మరి ఆ జంట ఎలా ఫీల్ అవుతారో చూడాలి మరి.