కళ్యాణ్ రామ్ ఆమిగోస్ మొట్టమొదటి రివ్యూ..!!

గత ఏడాది బింబి సార చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఈ చిత్రంతో ఏకంగా రూ.40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి కష్ట కాలంలో ఉన్న సినీ పరిశ్రమకు ఆపద్బాంధవుడుగా మారారు కళ్యాణ్ రామ్. ఈ ఏడాది ఆమిగోస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రేపటి రోజున రాబోతున్నారు. ఎల్లప్పుడూ కూడా కొత్త తరహా కథలను ఎంచుకుంటూ కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ ఉంటారు. కళ్యాణ్ రామ్. ఈసారి కూడా అదే తరహా పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Kalyan Ram with his 3 Amigos coming on?మొదటిసారి అమిగొస్ సినిమాలో త్రిపాత్రాభినయంలో నటిస్తున్నారు కళ్యాణ్ రామ్. ఇప్పటివరకు విడుదలైన టీజర్ ,ట్రైలర్ ఎంత గానో ఆకట్టుకుంటున్నాయి.ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నాయి. సెన్సార్ బోర్డు మెంబర్స్ యూఎస్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించి ప్రీమియర్ ని కొంతమంది సినీ ప్రముఖులు డిస్ట్రిబ్యూటర్లు సైతం వేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ షో నుంచి వచ్చిన టాక్ ప్రకారం.. కళ్యాణ్ రామ్ మరొకసారి హిట్ కొట్టబోతున్నాడా లేదా అనే విషయం తెలుసుకుందాం.

Amigos Teaser: Kalyan Ram comes up with an intriguing Doppelgänger storyఈ చిత్రం ద్వారానే డైరెక్టర్ రాజేందర్ రెడ్డి ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఈవెంట్ లో కూడా తన మాటలతో అందరిని ఆశ్చర్యపరిచారు డైరెక్టర్ఇక ఈ సినిమా ప్రారంభం నుండి ఆయనకు ఎంత నమ్మకముందో ఆయన మాటలు వింటే మనకి అర్థమవుతోంది.అసలు విషయంలోకి వెళ్తే కళ్యాణ్ రామ్ నటన ఈ చిత్రానికే హైలైట్ గా ఉండబోతుందని ఈ చిత్రంలో మూడు డిఫరెంట్ పాత్రలలో కూడా అద్భుతంగా నటించినట్లుగా సమాచారం. ఇక ఈ చిత్రంలో ఇంటర్వెల్ ముందు వచ్చే సస్పెన్స్ ప్రేక్షకులను చాలా త్రిల్ గురి చేస్తుందని సమాచారం. అలాగే రొమాన్స్, కామెడీ పరంగా కూడా బాగానే ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది.మరి ఈ సినిమా పూర్తి టాక్ తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే.