బాలకృష్ణ ఆ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నాడా.. ఫ్యాన్స్‌కి పునకాలేనా??

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చే సినిమా ఏదైనా సరే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. వీరిద్దరి కాంబోలో సినిమా అంటే ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి కూడా ఉరికొస్తారు. అయితే వీరిద్దరి కాంబోను ఇష్టపడే వారందరికీ ప్రజెంట్ గుడ్ న్యూస్ ఏంటంటే.. మరికొన్ని నెలల్లో ఈ కాంబోలో మరో బ్లాక్ బస్టర్ సినిమా రానుంది. సింహ 2, లెజెండ్ 2, అఖండ 2 సినిమాలో ఏదో ఒకటి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అయితే చాలా మంది అభిమానులు లెజెండ్ 2 లేదా అఖండ 2 వస్తే బాగుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీరి కాంబో సినిమా అనగానే స్టార్ ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అయితే బాలయ్య లెజెండ్ 2 సినిమా తీయాలనే ఆలోచనలో ఉంటే, బోయపాటి మాత్రం అఖండ 2 సినిమాపై ఎక్కువగా ఆసక్తి కనపరుస్తున్నారని సమాచారం. ఈ రెండు సినిమాలలో ఎక్కువమంది లెజెండ్ 2కే వంత పాడుతున్నారని ప్రచారం జరుగుతోంది.

ఇక బాలయ్య, బోయపాటి కాంబినేషన్ సినిమా అంటే దాదాపు 100 కోట్ల రూపాయల షేర్ కలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే కామెంట్స్ వస్తున్నాయి. మరి బాలయ్య, బోయపాటి మళ్లీ జత కడుతున్నారా, వారి ఈ సినిమా హిట్ అవుతుందా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఇప్పటివరకు బాలకృష్ణ ఒక్కో సినిమాకి దాదాపు రూ.16 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇక నుంచి ఆయన పారితోషికం రూ.20 కోట్లకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పారితోషికం మాత్రమే కాదు ఆయన రేంజ్ కూడా రోజురోజుకి పెరుగుతూనే ఉంది.