తమన్నా ఈసారైనా సక్సెస్ అయ్యేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వైవిద్యమైన సినిమాలలో నటించి హీరోయిన్గా కూడా పేరు పొందడమే కాకుండా విలన్ గా కూడా మంచి పేరు సంపాదించింది. అయితే ఈ మధ్యకాలంలో పెద్దగా ఏ సినిమా కూడా సక్సెస్ కాలేదు ఈ ముద్దుగుమ్మది. ఇప్పుడు తాజాగా బంపర్ ఆఫర్ కొట్టేసింది రజినీకాంత్ తో జైలర్ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అందుకు సంబంధించి చిత్ర బృందం ఒక పోస్టర్ను కూడా విడుదల చేసింది.

Is this Tamannaah Bhatia's role in 'Jailer'? - Surprising details - Tamil  News - IndiaGlitz.com
ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సన్ పిక్చర్ బ్యానర్ మీద ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కన్నడ స్టార్ హీరో శివారాజకుమార్, మలయాళం నటుడు మోహన్లాల్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక దీంతో ఈ సినిమా ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయడం ఖాయమంటూ తెలియజేస్తున్నారు చిత్ర బృందం. తెలుగు నుంచి నటుడు సునీల్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్లు నిన్నటి రోజున ఒక పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది.

ఇప్పుడు ఇదే సినిమా నుంచి తమన్నా ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. తమన్నా ఫస్ట్ లుక్ పెద్దగా ఆశ్చర్యపరిచే విధంగా ఏమీ లేకపోయినా ఒక రకంగా ఆమెకు ఇది కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే తమన్నా కు వరుస అవకాశాలైతే దొరుకుతున్న సక్సెస్ మాత్రం అందుకోలేక పోతోంది. ఈ సినిమా ఒకరకంగా ఆమెకు లాస్ట్ చాన్స్ అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆమె విజయవర్మ అనే నటుడుతో చట్టపట్టలేసుకొని తిరుగుతూ మీడియాకు అంట కనిపించింది.ఒకవేళ ఈ సినిమా తేడా కొడితే కచ్చితంగా వివాహం చేసుకుంటుందని సమాచారం. మరి ఈ సినిమాతో నైనా తమన్నా సక్సెస్ అవుతుందేమో చూడాలి.