మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా `వాల్తేరు వీరయ్య` మూవీతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అందించిన సక్సెస్ తో ఫుల్ జోష్‌లో ఉన్న చిరంజీవి.. ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే తన తదుపరి చిత్రమైన `భోళా శంకర్`పై ఫోకస్ పెట్టాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
అలాగే కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా కనిపించబోతోంది. తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ముప్పై శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. `వాల్తేరు వీరయ్య` విడుదల కారణంగా ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడగా.. మళ్లీ తాజాగా ఈ సినిమాను రీస్టార్ట్ చేశారు. హైదరాబాద్‌లోని పెద్దమ్మ టెంపుల్‌లో నిన్న భోళా శంకర్ కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. అయితే ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో మొదట నుంచి వ్యతిరేఖత ఉంది.
అందుకు ప్రధాన కారణం ఇది రీమేక్ కావడం. చిరుకి రీమేక్ సినిమాలు ఏ మాత్రం కలిసిరావడం లేదు. అందుకు గాడ్ ఫాదర్ పెద్ద నిదర్శనం. పైగా మెహర్ రమేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఒక్కటీ లేదు. ఈ నేపథ్యంలోనే `భోళా శంకర్`ను చేయవద్దని ఫ్యాన్స్ ఎప్పటి నుంచి చిరును రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ చిరు ఈ మూవీని పట్టాలెక్కించాడు. అయితే సినిమా రీస్టార్ట్ చేసే ముందుకు మెహర్ రమేష్ కి చిరు ఊహించని షాక్ ఇచ్చాడట. అదేంటంటే.. భోళా శంకర్ ఔట్‌పుట్ తనకు నచ్చితేనే థియేర్స్ లో విడుదల ఉంటుందని, లేదంటే ఫాన్సీ రేట్ కి డైరెక్ట్ ఓటీటీ కి ఇచ్చేయాలని కండీషన్ పెట్టాడట. అందుకు ఒప్పుకున్నాకే చిరు సెట్స్ లో అడుగు పెట్టాడని టాక్ నడుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. సరైన నిర్ణయం తీసుకున్నారంటూ చిరుకు మద్దతు తెలుపుతున్నారు.