కొత్త ఇల్లు కొన్న త్రిష‌.. ఖ‌రీదు తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!?

సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొన్నాళ్లు చక్రం తిప్పిన ఈ భామ.. ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల‌తో బాగా సతమతం అయ్యింది. లేడీ ఓరియంయెంటెడ్ చిత్రాలు కూడా ఈ బ్యూటీ కెరీర్ ను నిలబెట్టలేకపోయాయి.

ఇక కెరీర్ డేంజర్‌ జోన్ లో పడింది అనుకుంటున్న‌ సమయంలో.. మణిశర్మ తెర‌కెక్కించిన `పొన్నియిన్ సెల్వ‌న్ 1` మూవీతో త్రిష మళ్లీ మంచి కం బ్యాక్ ఇచ్చింది. ఈ మూవీ తో త్రిషకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఇప్పటికే తమిళంలో అజిత్ కుమార్, విజయ్ దళపతి వంటి స్టార్ హీరోల సినిమాలకు సైన్ చేసిందని అంటున్నారు.

అలాగే తెలుగులోనూ పలు ప్రాజెక్టులు త్రిష టేకప్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే తాజాగా త్రిష చెన్నైలో ఓ ఇంటిని కొనుగోలు చేసిందట. ఈ ఇల్లు విజయ్ ద‌ళపతి ఇంటి సమీపంలోనే ఉంటుందట. అన్ని సౌకర్యాలతో అత్యంత విలాసంగా ఈ ఇంటిని తీర్చిదిద్దారని అంటున్నారు. ఇక ఈ ఇంటి ఖరీదు తెలిస్తే కళ్ళు తేలేస్తారు. ఎందుకంటే త్రిష ఏకంగా ఈ ఇంటిని రూ. 35 కోట్లు పెట్టి కొనుగోలు చేసిందని నెట్టింట జోరుగా టాక్ న‌డుస్తోంది.