భుజంపై చేయి వేయబోయిన స్టూడెంట్.. షాక్ అయిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్‌!

సినిమా సెలబ్రిటీలకు ఎవరికి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా హీరోయిన్లకు బీభత్సమైన అభిమానులు ఉంటారు. వారు తమ నగరానికి వస్తున్నారంటే చాలు వీరు మరో ఆలోచన లేకుండా వెళ్ళిపోతుంటారు. వీలైతే వారితో సెల్ఫీ తీసుకోవాలనుకుంటారు. అభిమానుల కంటే తమకేమి ఎక్కువ కాదని వారిని దగ్గరికి రానిచ్చి సెల్ఫీలు తీసుకునేందుకు హీరోయిన్లు కూడా ఒప్పుకుంటుంటారు. అయితే పద్ధతిగా గౌరవం ఇస్తూ వారితో సెల్ఫీలు దిగడానికి ప్రయత్నిస్తే మంచిదే. కానీ చనువిచ్చింది కదా అని అతి చేస్తే వారు చాలా ఇబ్బంది పడతారు.

ఈ విషయం తెలియని ఒక స్టూడెంట్ సూరరై పోట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) హీరోయిన్‌ అపర్ణ బాలమురళితో చాలా పిచ్చిగా ప్రవర్తించాడు. ప్రస్తుతం అపర్ణ తాను నటించిన తన్కం మూవీ ప్రమోషన్లలో పాల్గొంటోంది. ఈ మలయాళ మూవీ జనవరి 26న రిలీజ్ కానుంది. ఇంకా వారం రోజుల సమయం కూడా లేదు కాబట్టి తమ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన వంతుగా అపర్ణ చాలా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. అందులో భాగంగా తాజాగా కేరళలోని ఒక కాలేజ్‌కి మూవీ టీమ్‌తో కలిసి వెళ్ళింది. అక్కడ స్టేజ్ మీద ఉన్న అపర్ణ బాలమురళితో ఫొటో దిగేందుకు ఒక విద్యార్థి వేదిక మీదకు వచ్చాడు.

 

అతడు ఎవరి పర్మిషన్ లేకుండా డైరెక్ట్‌గా వేదిక మీదకి వచ్చి అపర్ణకు పూలు ఇచ్చాడు. ఆపై పర్మిషన్ లేకుండానే ఆమె చేయి పట్టుకున్నాడు. అతడు అంత ఫాస్ట్‌గా వచ్చేసి అలా చేస్తుంటే అపర్ణ చాలా అనీజీగా ఫీల్ అయింది. ఆ తర్వాత ఫొటోకి పోజు ఇవ్వాల్సిందిగా అతడు కోరడంతో వెంటనే లేచి నిలుచుంది. అయితే అతడు ఆమె భుజంపై చేయి వేసి ఫొటో దిగేందుకు ప్రయత్నించాడు. అతడు తన భుజంపై చేయి వేస్తున్నాడని తెలిసిన వెంటనే అపర్ణ అప్రమత్తమయ్యింది. అతని చేతిని తన భుజంపై వేయనీయలేదు. చాలా ఫాస్ట్‌గా ఆమె తప్పుకుంది. అయినా కూడా అతడు తన చేతిని ఆమె భుజంపై వేయడానికి చాలా ప్రయత్నించాడు.

ఆమె దగ్గర తన పప్పులు సాగమని తెలిసి చివరికి క్షమాపణ చెప్పాడు. ఇదంతా షాకింగ్‌గా అనిపించినా అపర్ణ చాలా హుందాగా చిరునవ్వుతో ఈ ఇన్సిడెంట్‌ని పెద్దది చేయలేదు. కాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసి ఫ్యాన్స్ అతడిపై ఫైర్ అవుతున్నారు. “ఏదో పాపం కదా అని ఫొటో దిగడానికి పర్మిషన్ ఇస్తే.. ఇలా చేస్తావా.. బుద్ధుందా నీకు అసలు?” అని చాలామంది తిడుతున్నారు. ఇది చాలా దారుణమని, స్టూడెంట్ అయ్యుండి అనాగరికుడిగా ఇలా ప్రవర్తించడమేందని మరికొందరు తిడుతున్నారు. ఈ ఘటనపై అపర్ణ స్పందిస్తూ ‘లా స్టూడెంట్ అయ్యుండి ఇలా ప్రవర్తించాడు. అసలు ఈ ఘటనపై ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేద’ని ఒక కామెంట్‌కి రిప్లై ఇస్తూ పేర్కొంది. ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.