సంక్రాంతి పోరులో విజేత ఎవరంటే..?

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన చిత్రాలలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు గట్టి పోటి గా నిలిచాయి. ఇదే సమయంలో కోలీవుడ్లో ఇద్దరు స్టార్ హీరోలతో ఒక వెలుగు వెలుగుతున్న హీరోలలో విజయ్ దలపతి వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అలాగే తెగింపు సినిమాతో పోటీలో నిలవడం జరిగింది. ఈ ఇద్దరు హీరోల మధ్య కోలీవుడ్లో మంచి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కోలీవుడ్లో తెగింపు, వారసుడు సినిమాలు విడుదలై ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నది.

Pongal 2023 / Sankaranti release slot gets crowded! Tamil Movie, Music  Reviews and News
వీరసింహారెడ్డి ఈ నేల 11 న ప్రేక్షకుల వద్దకు రావడం జరిగింది. మాస్ ఎంటర్టైన్మెంట్గా రిలీజ్ అయినయి చిత్రం నందమూరి అభిమానులకు బాగానే కనెక్ట్ అయిందని చెప్పవచ్చు. ఈ చిత్రం కూడా ఎవరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. వాల్తేరు వీరయ్య సినిమా కూడా తాజాగా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. దీంతో వాల్తేర్ వీరయ్య సినిమా బెటర్ అనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ఇక విజయ్ వారసుడు సినిమా తమిళంలో విడుదలయి ఎవరేజ్ టాక్ తెచ్చుకున్నప్పుడే తెలుగులో కూడా అదే టాక్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇలా సంక్రాంతి రేసులో పోటీపడుతున్న ఇద్దరు కోలీవుడ్ స్టార్స్, ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ సినిమాలు ఎవరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.

మరి ఈ సినిమాలలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడి కలెక్షన్లను రాపడుతుందో తెలియాల్సి ఉంది. కోలీవుడ్లో స్టార్స్ సినిమాలకి తెలుగులో మెగాస్టార్, బాలయ్య సినిమాలకు కలెక్షన్లు వచ్చే అవకాశాన్ని బట్టి ఈ ఏడాది సంక్రాంతి విజేతగా నిలుస్తారు. మరి ఎవరు నిలుస్తారో చూడాలి మరి.