నారాయణమూర్తిని మెప్పించిన తెలుగు హీరోయిన్ ఎవరంటే..?

టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోగా పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటించారు ఆర్ నారాయణ మూర్తి. నటుడుగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందుకోవడమే కాకుండా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలలో నటించారు. ఆయన సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా ఆలోచింపజేసేలా ఉంటాయి. తెలుగు సినిమాలలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన సైలని ఏర్పరచుకున్నారు. ఆర్.నారాయణమూర్తి ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను బాగా మెప్పించారు. ముఖ్యంగా సమాజాన్ని ప్రశ్నించే కథలతో సినిమాలను తెరకెక్కించడం ఈయన స్పెషాలిటీ అని చెప్పవచ్చు.ఆర్ నారాయణమూర్తి ఎప్పుడు కూడా తన జీవితంలో ప్రత్యేకమైన లగ్జరీ లైఫ్ కు నోచుకోలేదు.

Why no 'Temper' for Narayana Murthy?

ఇప్పటికీ కూడా తనకంటూ సొంతగా ఒక ఇల్లు కూడా నిర్మించుకోలేదు. సాధారణ మనిషిలా కూడా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. నారాయణమూర్తి ఆయన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు.. నారాయణమూర్తి కెరియర్ లో ఒసేయ్ రాములమ్మ ,ఎర్రసైన్యం, చీమలదండు ఇలా ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు. ఇదంతా ఇలా ఉండగా ఆర్.నారాయణమూర్తికి ఇష్టమైన హీరోయిన్ ఈ జనరేషన్లో ఉన్నట్లుగా సమాచారం. ఆమే ఎవరో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.

May Day Special movies: మే డే స్పెషల్.. తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన 'ఎర్ర'  సినిమాలు ఇవే..
ఆర్.నారాయణమూర్తికి ఈ జనరేషన్లో చాలా ఇష్టమైన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం సాయి పల్లవెనట. ఆర్.నారాయణమూర్తి ఏ హీరోయిన్ ఇంతగా ఇప్పటివరకు పొగిడింది లేదు. కేవలం నటన పరంగా బాగుంటే బాగా చేసిందని చెబుతారు. కానీ సాయి పల్లవి యాక్టింగ్ ఫిదా అయిపోయారని సమాచారం. గతంలో ఫిదా మూవీ సక్సెస్ వేదికగా ఆర్.నారాయణమూర్తి హాజరైన సాయి పల్లవిని పొగడ్తలతో ముంచేశారు. ఆమె నటనను అద్భుతంగా ప్రదర్శించారు. అలాగే శ్యామ్ సింగరాయ్ సినిమా సక్సెస్ మీట్ లో కూడా ఈమెను ప్రశంసించారు. ముఖ్యంగా ఈమె నటన వాయిస్ తెలుగులో మాట్లాడే విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయని తెలిపారు.