కీర్తి సురేష్ పెళ్లి పై అసలు విషయం ఇదే..!!

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ విలక్షణమైన పాత్రలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఒకానొక దశలో తన నటనపై విమర్శలు కూడా వినిపించిన వారిని సైతం తన చిరునవ్వుతో స్వీకరించి మహానటి సినిమాతో అందరికీ సమాధానం తెలియజేసింది. ఈ సినిమాతో జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడమే కాకుండా పలు ప్రశంశాల వర్షం కూడా అందుకుందిబాలీవుడ్ ఆఫర్ ని సైతం వదులుకొని దక్షిణాది చిత్రాలలోనే నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Keerthy Suresh Wiki, Age, Boyfriend, Husband, Caste, Biography & More -  WikiBioగడిచిన కొన్ని రోజులుగా ప్రేమ పెళ్లికి సంబంధించి వార్తలు వైరల్ గా మారుతున్నాయి. మహానటి సినిమా తర్వాత కమర్షియల్ చిత్రాలలోనే నటిస్తూ తన నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తోంది
మలయాళ సినిమాతో చైల్డ్ యాక్టర్ గా తన సినీ కెరియర్ను ప్రారంభించిన కీర్తి సురేష్ పలు భాషలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. తాజాగా కీర్తి సురేష్ గత కొంతకాలంగా ప్రేమలో ఉందని తన చిన్ననాటి క్లాస్మేట్ ని ప్రేమిస్తోంది అంటూ వార్తలు వినిపించాయి. వీరి ప్రేమ గత 13 ఏళ్లుగా కొనసాగుతోందని త్వరలో వివాహం చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కీర్తి సురేష్ తల్లి అలనాటి హీరోయిన్ మేనక స్పందించింది.

తన కూతురు కీర్తి సురేష్ పై వస్తున్న వార్తలని కేవలం పుకార్లేదని ఆ వార్తలని ఖండించింది. అయితే కీర్తి సురేష్ మాత్రం ఈ వార్తలపై ఎలాంటి వివరణ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. ప్రస్తుతం కీర్తి సురేష్ నటిస్తున్న దసరా చిత్రంలో నటిస్తోంది ఈ సినిమా భారీ అంచనాల మధ్య మార్చి 30వ తేదీన విడుదల కాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.