వార్నీ.. రామ్ కు పెళ్లైందా..? అంత పెద్ద కొడుకు కూడా ఉన్నాడా..?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒకడు. ఈయ‌న ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి దాదాపు 19 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఎన్నో హిట్ల‌ను ఖాతాలో వేసుకున్నాడు. భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ల‌వ్ బాయ్ ఇమేజ్ నుంచి మాస్ హీరోగా మారి ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌తో దూసుకుపోతున్నాడు.

కానీ, పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. ఈయ‌న వ‌య‌సు 34 ఏళ్లు. మరో నాలుగు నెలలు పోతే 35వ ఏట అడుగు పెట్టనున్నారు. దీంతో అభిమానులు ఈయన పెళ్లి ఎప్పుడంటూ ఎదురుచూస్తున్నారు. గతేడాది రామ్ పోతినేని త‌న స్కూల్ ఫ్రెండ్ ను వివాహం చేసుకోబోతున్నాడంటూ ప్ర‌చారం జ‌రిగింది. కానీ, అది పుకారుగా మిగిలింది.

అయితే తాజాగా రామ్ ఓ పిల్లవాడితో దిగిన ఓ స్మైలీ ఫొటోను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటూ.. ‘స‌న్ డే.. సిద్ధాంత్ పోతినేని` అంటూ క్యాషన్ ఇచ్చాడు. దీంతో వార్నీ.. రామ్ కు పెళ్లైందా..? అంత పెద్ద కొడుకు కూడా ఉన్నాడా..? అంటూ నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. కానీ, ఆ ఫోటోలో ఉన్న బుడ్డొడు రామ్ అన్న కుమారుడు. సిద్ధాంత్ అంటే రామ్ కు మ‌హా ఇష్టం. ఫ్రీ టైమ్ దొరికితే చాలు సిద్ధాంత్ తో ఆడుకుంటూ ఉంటాడు. కాగా, రామ్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈయ‌న బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాయి. రామ్ కెరీర్ లో తెర‌కెక్కుతున్న 20వ ప్రాజెక్ట్ ఇది.