మద్యానికి.. సిగరెట్ కు బానిసైన రజినీకాంత్.. తనే మార్చిందంటు ఎమోషనల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముద్దుగా అభిమానులు ఈయనను తలైవా అంటూ పిలుస్తూ ఉంటారు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన జీవితంలో బస్ కండక్టర్ నుంచి స్టార్ హీరోగా ఎదగడం వెనుక ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తన జీవితాన్ని తన భార్య లతా ఎంతో మార్చిందని ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ ఇప్పటికే ఇంటర్వ్యూల ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. సమయం వచ్చినప్పుడు తన సతీమణి గురించి ఎన్నో రకాలుగా చెబుతూ తనకు తన కుటుంబానికి ఆమె చేసిన సేవలు గురించి త్యాగం గురించి చెబుతూ ఉంటారు.

Rajinikanth opens up on habits which took a toll on his health, credits  wife Latha for

తాజాగా ఆయన మరోసారి తన జీవిత భాగస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల తమిళనాడులో జరిగిన ఒక కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఆయన వేదికపై మాట్లాడుతూ.. తన భార్య వల్లే ఈ క్రమశిక్షణ వచ్చింది అని..తన జీవితాంతం ఆమెకు రుణపడి ఉంటాను అని తలైవా తెలిపారు.. ఆయన మాట్లాడుతూ.. నా భార్య లతను నాకు పరిచయం చేసిన వై జి మహేంద్రన్ కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. కండక్టర్గా ఉన్నప్పుడు ప్రతిరోజు మద్యం సేవించేవాడిని.. ఎన్ని సిగరెట్స్ తాగుతున్నానో కూడా లెక్కే ఉండేది కాదు. ప్రతిరోజు నాన్ వెజ్ తింటూ.. సిగరెట్స్ తాగుతూ.. మద్యం సేవించే వాడిని కనీసం రోజుకు రెండుసార్లు నాన్ వెజ్ తప్పనిసరిగా తింటాను.

Rajinikanth: మద్యానికి బానిసైన నన్ను ఆమె ఎంతో మార్చింది..: రజనీకాంత్‌

అయితే ఈ మూడింటిని ఎక్కువగా తీసుకునేవాళ్ళు 60 సంవత్సరాల తర్వాత ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపలేరు. నిజానికీ నా భార్య లతా నన్ను చాలా మార్చింది. ఇప్పుడు క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుతున్నాను అంటూ తెలిపారు. రజినీకాంత్ జైలర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ,కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ , తెలుగు కమెడియన్ సునీల్, తమన్నా , వసంత రవి , విజయకన్ , రమ్యకృష్ణ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు.