ప్రాజెక్ట్ కే : భ‌య‌పెడుతోన్న‌ దీపిక ఫస్ట్ లుక్..!

బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన చేసే సినిమాల‌లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా మాత్రం ప్రాజెక్టుకే. ఈ సినిమాను దర్శకుడు హాలీవుడ్ సినిమాలకు ఏం మాత్రం తీసిపోనట్టుగా ఉంటుందని దర్శకుడు నాగ అశ్విన్ పలు సందర్భాలలో ఈ సినిమా గురించి చెప్పాడు.

Project K' makers unveil futuristic new posters to mark Prabhas' birthday;  say 'Heroes are not born, they rise' | Hindi Movie News - Times of India

అందుకే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ కే సినిమాలో ప్రభాస్‌కు జంటగా బాలీవుడ్ అందాల భామ దీపిక పదుకొనే నటిస్తుంది. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా నుంచి దీపిక‌ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ఒకటి రివీల్ చేశారు. అందులో దీపికా పదుకునే లుక్ ను రివీల్ చేయలేదు కానీ ఆమె యొక్క ఔట్ ఫిట్ ఇలా ఉంటుందనే ఒక ఐడియా ఇచ్చారు. డార్క్ షేడ్ లో ఉన్న ఆ ఫోటో చూస్తూ ఉంటే ఓ గ్రహాంతర వాసిలాగా అనిపిస్తుంది.

Prabhas is back on the sets of director Nag Ashwin's Project K - India Today

సోషల్ మీడియాలో ఈ పోస్టర్ ను చూస్తూ ఉంటే ఇదేదో హాలీవుడ్ సూపర్ హీరోస్ సినిమా మాదిరిగా అనిపిస్తుంది అంటూ మ‌రి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీపికా ను కూడా నెవ్వర్ బిఫోర్ అనే విధంగా ఈ సినిమాలో ఉండ‌బోతుంద‌ని ఈ పోస్ట‌ర్ చూస్తుంటే అనిసిస్తుంది. కాస్త భ‌యంగా కూడా ఉంది. ఇక ప్రభాస్ మరియు అమితాబచ్చన్ ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నారో అనేది తెలియాల్సి ఉంది.

Birthday Poster: Deepika Arrives As A Hope In The Dark!

ఎంతో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రాబోతుంద‌నినే ప్రచారం కూడా జరుగుతోంది. తాజా దీపికా లుక్ చూస్తూ ఉంటే సూపర్ హీరోస్ సినిమాల‌ మాదిరిగా ఉండాబోతుంద‌ని అనిపిస్తుంది. ఇక ఈ సినిమాతో ప్ర‌భ‌స్ హ‌లీవుడ్ రెంజ్‌కు వెళ్ళటం గ్యారెంటీ.