నందమూరి కళ్యాణ్ రామ్ పటాస్ సినిమా తర్వాత చాలాకాలం ప్లాప్ సినిమాలతో తన కెరిర్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఇక గత సంవత్సరం బింబిసారా సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఆ సినిమా తర్వాత అమిగోస్, డెవిల్ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలపై నందమూరి అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎన్నో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న అమిగోస్ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ అధికార ప్రకట ఇచ్చింది. న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర పోస్టర్స్ కూడా విడుదల చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా టీజర్ విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. జనవరి 8న అమీగోస్ టీజర్ విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించింది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుబురు గడ్డం మరియు పొడవాటి జుట్టుతో చేతిలో గన్ను పట్టుకున్న కళ్యాణ్ రామ్ ను చూస్తుంటే చాలా స్పెషల్ గా కనిపిస్తున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో మూడు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది. ఇప్పటికే ఆ మూడు పాత్రలకు సంబంధించిన లుక్‌లు కూడా విడుదల చేయగా.
ఇక తాజాగా విడుదలైన లుక్ లో కళ్యాణ్ రామ్ ను చూస్తుంటే ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇక ఈ సినిమా టీజర్ విడుదలయ్యాక ఈ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెరిగే అవకాశం ఉందని మేకర్స్ చెపుతున్నారు. ఈ సినిమాకు రాజేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది.