మరో అమ్మాయిని తగులుకున్న షణ్ముఖ్.. ఘాటైన రొమాన్స్‌తో ఫొటో రిలీజ్..!

చిన్న సోషల్ మీడియా స్టార్ నుంచి సెలబ్రిటీ స్థాయికి ఏదిగాడు షణ్ముఖ్ జస్వంత్. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్‌సిరీస్‌ల ద్వారా చాలామందికి చేరువైన ఈ నటుడు బిగ్‌బాస్ సీజన్ 5 ద్వారా మరింత పాపులర్ అయ్యాడు. ఈ షో కారణంగానే షణ్ముఖ్ తన గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయనని కోల్పోవాల్సి వచ్చిందని అంటుంటారు. ఎందుకంటే షణ్ముఖ్ బిగ్‌బాస్‌లో సిరితో కలిసి చాలా రొమాన్స్ చేశాడు. తనకి ఒక లవర్ ఉందనే విషయాన్ని మరిచి సిరితో హద్దులన్నీ మీరాడు.

 

వీటన్నిటిని చూడలేక దీప్తి షణ్ముఖ్ తో బ్రేకప్ చెప్పేసింది. ఫ్యాన్స్ వీరు విడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. తర్వాత వీరిద్దరూ తమ లైఫ్ లో మూవ్ ఆన్ కావడంతో ఫ్యాన్స్ కూడా వీరి రిలేషన్ మరిచిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే షణ్ముఖ్ షేర్ చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పెద్ద రచ్చకు దారితీసింది. ఆ ఫొటోలో ఏముందంటే షణ్ముఖ్ ఒక అమ్మాయి చేయి పట్టుకుని రొమాన్స్ చేస్తూ కనిపించాడు. ఈ ఫోటో చూడగానే చాలామంది నెటిజన్లు అతడిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మొన్న దీప్తి సునయన, నిన్న సిరి ఈరోజు ఏమో మరో అమ్మాయిని తగులుకున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఫొటోలో కనిపించే అమ్మాయి పేరు సుష్మిత శెట్టి. ఈ బ్యూటీ జాను అనే వీడియో సాంగ్‌లో షణ్ముఖ్ తో కలిసి నటించింది. ఆమెతోనే షణ్ముఖ్ ఫొటోలు ఎక్కువ రిలీజ్ చేస్తుంటే వారి మధ్య ఏదో ఉన్నట్లు నెటిజన్లు భావించి అతడిని ట్రోల్ చేస్తున్నారు. మరి వీరి మధ్య నిజంగానే ఏమైనా ఉందా? లేక సాంగ్ ప్రమోషన్ కోసమే షణ్ముఖ్ ఆమెతో దిగిన తన ఫొటోలు షేర్ చేసుకుంటున్నాడా? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.