నేను రిలేషన్ లో ఉన్నాను.. ఎట్ట‌కేల‌కు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన యాంక‌ర్ ప్ర‌దీప్‌!

బుల్లితెర స్టార్ యాంక‌ర్‌, యంగ్ హీరో ప్ర‌దీప్ మాచిరాజు పెళ్లి వార్త‌లు గ‌త కొద్ది రోజుల నుంచి సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఆ మధ్యన పొలిటికల్‌ లీడర్‌ కూతురితోనే అతని వివాహం అని వార్తలు వినిపించాయి. మొన్న‌టికి మొన్న ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతును వివాహం చేసుకోబోతున్నాడని ప్ర‌చారం జ‌రిగింది.

ప్రదీప్-నవ్య చాలా రోజులుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ఎట్టకేలకు వీరి బంధాన్ని పెళ్లితో మ‌రింత ముందుకు తీసుకెళ్లాల‌ని డిసైడ్ అయిన వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌పై ఎట్ట‌కేల‌కు ప్ర‌దీప్ స్వ‌యంగా స్పందిస్తూ.. తాను రిలేష‌న్ లో ఉన్నాన‌ని ఓ సీక్రెట్ ను బ‌య‌ట‌పెట్టాయి. అయితే ప్ర‌దీప్ రిలేష‌న్ లో ఉన్న‌ది న‌వ్య‌తో కాదు.

నవ్య మారోతుతో ప్రేమ‌, పెళ్లి అంటూ వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వమ‌ని ప్ర‌దీప్ తేల్చేశాడు. నాకు ఆ తరహా రిలేషన్ లేదు. కేవలం టెలివిజన్ షోస్ తో నేను రిలేషన్ లో ఉన్నాను. అంతే కానీ నేను ఎవరినీ ప్రేమించలేదు. పెళ్లి చేసుకోబోవడం లేదని తేల్చి చెప్పాడు. ప్రస్తుతం త‌న‌ ఫోకస్ పూర్తిగా కెరీర్ మీదే ఉందని ప్ర‌దీన్ పేర్కొన్నాడు.